అడవిలో సింహాన్ని ఎదిరించే శక్తి ఇంకే జంతువుకూ లేదనే చెప్పాలి.ఎంతటి బలమైన జంతువైనా లేదా పెద్ద జంతువైనా సరే సింహానికి ఆహారం కావాల్సిందే.
ఎందుకంటే దానికున్న బలం అది మరి.మరి అలాంటి సింహం కూడా కొన్న సార్లు చతికిల పడుతుంది.
దాన్ని కూడా కొన్ని జంతువులు పరుగులు పెట్టించిన ఫొటోలు, వీడియోలు మనకు నెట్టింట కనిపిస్తూనే ఉంటాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తోంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక సాధారణంగానే అడవిలో జంతువులు బతికేందుకు నిరంతరం కష్టపడాల్సిందే.
ఎందుకంటే వాటికి తిండి కావాలంటే సరైన వ్యూహం, తెలివి లేకపోతే మిగతా జంతువులకు బలై పోవడం కామన్ అనే చెప్పాలి.ఇక శాఖాహార లేదా చిన్న జంతువుల పరిస్థితి అయితే దిన దిన గండం అనే చెప్పాలేమో.
ఇక మనకు సోషల్ మీడియాలో సింహాలు వేటాడుతున్న వీడియోలు ఎన్నో కనిపిస్తుంటాయి.ఈ తరహా వేటకు సంబంధించిన వీడియోలకు కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఇక ఇప్పుడు కాస్త సింహాల గుంపు ఓ మానిటర్ బల్లిని వేటాడితే అనుకోకుండా అక్కడకు వచ్చిన గేదె దాన్ని ఎలా కాపాడుతుందో చూడొచ్చు.
ఆ మానిటర్ బల్లిని ఎలాగైనా తినేయాలని చూస్తున్న సింహాలకు ఆ గేదె ఎలా బుద్ధి చెప్తుందనేదే ఇందులో ఉన్న వీడియో.ఆ గుంపులో ఒక సింహం కాస్త ఆ బల్లిని నోట కరుచుకుని పరిగెత్తుతుండగా దాన్ని గమనించిన గేదె ఆ సింహాన్ని మెరుపు దాడితో హడలెత్తిస్తుంది.ఆ సింహానికి ఏ మాత్రం భయపడకుండా తన కొమ్ములతో పొడుస్తూ గాల్లో గింగిరాలు తిప్పించడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
ఇక గేదె దెబ్బకు అక్కడ ఉన్న సింహాలు అన్నీ కూడా పారిపోతాయి.ఈ విధంగా మొత్తానికి ఆ మానిటర్ బల్లిని గేదె కాపాడుతుంది.