వైరల్ వీడియో: బిందెలో ఇరుక్కుపోయిన బాలుడి తల.. చివరకు..?!

చిన్నపిల్లలు ఆడుకోవడం, అల్లరి చేయడం సహజమైన ప్రక్రియే.అయితే వారి అల్లరి ఒక్కొక్కసారి శృతిమించితే అనేక అనర్ధాలు జరగడం మనం గమనిస్తూనే ఉంటాం.

 Viral Video Boys Head Stuck In A Ditch Finally-TeluguStop.com

కొన్నిసార్లు చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసే ఉంటాం.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న కేశపట్నం లో చోటు చేసుకుంది.

చిన్న పిల్లాడు చేసిన చిన్న తప్పు ప్రాణాంతక ఘటనగా చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Viral Video Boys Head Stuck In A Ditch Finally-వైరల్ వీడియో: బిందెలో ఇరుక్కుపోయిన బాలుడి తల.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఐదు సంవత్సరాలు ఉన్న ఆ బాలుడు తన ఇంట్లో ఉన్న స్టీల్ బిందెతో ఆడుకుంటుండగా పొరపాటున తన తలను బిందెలో ఇరికించేశాడు.ఆ సమయంలో బాలుడు బిందెలో తల నుంచి పెద్ద పెద్ద కేకలు వేయడంతో ఏం జరిగిందా అని వచ్చి చూసిన బాలుడు తల్లిదండ్రులకు అసలు ఏం చేయాలో కొద్ది నిమిషాల పాటు అర్థం కాలేదు.

అయితే కొద్దిసేపటి తర్వాత ఆ బిందెను తల్లిదండ్రులు తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.అలా చేసిన సమయంలో ఓవైపు చిన్నారి ఏడుపులు వినిపిస్తుండగా.మరోవైపు తల్లిదండ్రులు ఆవేదన చిన్నారి తల్లి వైపు నుండి తీసేందుకు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో తల్లిదండ్రులు బాగా భయాందోళనకు గురయ్యారు.

ఈ సమయంలో అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి చేసేదేమీలేక స్టీల్ బిందెలు కత్తిరించే ప్రయత్నం చేశారు.

బిందెను యంత్రంతో కత్తిరిస్తున్న సమయంలో వాటి ముక్కలు కళ్ళలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మొత్తానికి రెండు గంటలపాటు అతి కష్టం మీద అ బిందెను మిషన్ తో కత్తిరించి చిన్నారి తలను నుండి బయటికి తీశారు.దీంతో చిన్నారి తల్లిదండ్రులు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో మీరు కూడా చూసేయండి.

#Viral Video #Boys Head

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు