వైరల్ వీడియో: తాటి ముచిక్కతో మాస్క్ తయారు చేసిన బుడ్డోడు..!

ఎండాకాలంలో వచ్చే అధిక వేడిని తట్టుకోవటానికి ఎంచక్కా చల్ల చల్లగా ఉండే తాటి ముంజులు తింటే భలే ఉంటాయి కదా.తాటి ముంజలు పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా.

 Viral Video Boy Prepared Corona Mask With Palm Fruit-TeluguStop.com

తాటి ముంజులను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాయి.పట్టణాల్లో అయితే ఈ తాటి ముంజలు అనేవి అంతగా లభ్యం కావు కానీ.

పల్లెటూర్లలో మాత్రం తాటి ముంజులు విరివిగా లభిస్తాయి.లేత ముంజుల్లో ఉంటే నీరు భలే టేస్టీ గా ఉంటాయి.

 Viral Video Boy Prepared Corona Mask With Palm Fruit-వైరల్ వీడియో: తాటి ముచిక్కతో మాస్క్ తయారు చేసిన బుడ్డోడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేత ముంజులు ఎన్ని తిన్నాగాని అసలు తిన్నట్టు అనిపించవు.అయితే ఇవి ఎక్కువగా ఎండాకాలంలో దొరుకుతాయి.

ఈ తాటి ముంజులు తినడం వలన శరీరంలోని వేడి తగ్గడంతో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.అయితే తాటిచెట్టుకు ఈ ముంజు కాయలు కాస్తాయి.

ఈ ముంజు కాయలు బాగా పండితే వాటినే మనం తాటి పండ్లు అంటాము.ముంజులు ఎంత రుచిగా ఉంటాయో ఈ తాటి కాయ కూడా అంతే రుచిగా ఉంటుంది.

చూడడానికి బాగా నల్లగా ఉంటుంది.లోపల మాత్రం మూడు విత్తనాలు ఉంటాయి.

అలాగే లోపల ఉండే తాటి పీచు పసుపు రంగులో ఉంటుంది.ఆ తాటికాయలతో తాటి ఇడ్లిలు, తాటి గారెలు, తాటి కుడుములు ఇలా రకరకాల వెరైటీ వంటలు చేసుకోవచ్చు.

పొయ్యి వెలిగించి ఒక పెన్నం పెట్టి దాని మీద తాటికాయ పెట్టి సన్నని మంట మీద కాల్చాలి.తాటికాయ కాల్చక మంచి సువాసన వస్తుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక పైనే తొక్క పారేసి లోపల భాగాన్ని తినాలి.సర్లే గాని ఇప్పుడు ఈ తాటికాయ గోల గురించి కాసేపు పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం.

Telugu Boy, Corona Mask, Eco Friendly, Kid, Mask, Palm Fruit Mask, Prepared, Social Media, Viral Latest, Viral News, Viral Video-Latest News - Telugu

కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి మాస్కులు ధరిస్తున్నారు.ఈ క్రమంలో మార్కెట్లోకి రకరకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి.అయితే ఒక బుడ్డోడు మాత్రం తన చిన్ని మెదడుకి పని పెట్టి తాటి కాయల పైనే ఉండే ముచ్చికతో మాస్క్ తయారు చేసేసాడు.ఏంటి షాక్ అవుతున్నారా…? అసలు తాటి కాయ మీద ఉండే ముచ్చికతో మాస్క్ ఎలా అని ఆలోచిస్తున్నారా.? కానీ ఈ బుడ్డోడు మాత్రం చేసి చూపించాడు.తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురానికి చెందిన తనీష్ అనే బాలుడు తన క్రియేటివ్ థింకింగ్ తో తాటి ముచ్చికతో మాస్క్ తయారు చేయవచ్చని అంటున్నాడు.

Telugu Boy, Corona Mask, Eco Friendly, Kid, Mask, Palm Fruit Mask, Prepared, Social Media, Viral Latest, Viral News, Viral Video-Latest News - Telugu

తన ఇంటి వెనుక పనికి రాని తాటి ముచ్చికలను పెరట్లో పడేసారు.వాటిని చూసిన ఈ బాబు బుజ్జి మెదడులో ఒక చిన్న ఆలోచన తట్టింది.అక్కడ పారేసి ఉన్న తాటి ముచ్చికలను ఏరుకొచ్చి, ఆ ముచ్చికకు రెండువైపులా రంద్రాలు చేసి ఒక థ్రెడ్ ను కట్టాడు.అలాగే ఈ మాస్కులు పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందిని తలపెట్టవు అని కూడా అంటున్నాడు ఈ బాబు.

ఏదేమైనా ఈ బాబు తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ తాటి ముచ్చిక మాస్క్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పిల్లాడి మేధాశక్తికి అందరూ అభినందిస్తున్నారు.

#Corona Mask #Palm Fruit Mask #Mask #Prepared #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు