వైరల్ వీడియో: ఆరాధ్య క్రికెటర్ ను డకౌట్ చేసి సారీ చెప్పిన బౌలర్..

ప్రస్తుతం పాకిస్తాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతోంది.ప్రస్తుతం ఈ టోర్నీ కూడా చివరి దశకు చేరుకుంది.

 Haris Rauf Apologises To Shahid Afridi After Bowling Him Out For Duck, Bowler Ha-TeluguStop.com

ఇకపోతే ఈ టోర్నీ ఫైనల్లో కరాచీ కింగ్స్ అలాగే లాహోర్ కాలండర్స్ మధ్య పోటీ జరగనుంది.ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా లాహోర్ కాలండర్స్ అలాగే ముల్తాన్ సుల్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర విషయం కనపడింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వస్తే.

తాజాగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్.

పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదిని క్లీన్ బౌల్డ్ చేశాడు.అది కూడా డక్ అవుట్ చేశాడు.

ప్రస్తుతం ఈ అవుట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇందుకు ఓ కారణం కూడా ఉంది.

ఈ మ్యాచ్ లో షాహిద్ అఫ్రిది డకౌట్ అయిన తర్వాత బౌలర్ అఫ్రిదికి క్షమాపణ చెప్పాడు.ఈ ఎలిమినేషన్ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టు నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కాలంలో లాహోర్ కాలండర్స్ చితికల పడింది.14వ ఓవర్ లో ముల్తాన్ జట్టు బ్యాట్స్మెన్ గా షాహిద్ అఫ్రిది క్రీజ్ లోకి వచ్చి రాగానే బౌలర్ అద్భుతమైన ఇన్ స్వింగ్ యార్కర్ తో గోల్డెన్ డక్ అవుట్ గా ఆయనను అవుట్ చేసాడు.

అయితే అవుట్ చేసినందుకుగాను బౌలర్ అతనికి క్షమాపణలు తెలిపాడు.ఇందుకు సంబంధించి పిఎస్ఎల్ సోషల్ మీడియాలో ఈ వీడియోకు లాల నన్ను క్షమించండి అంటూ క్యాప్షన్ తో షేర్ చేయడం జరిగింది.ఈ వీడియోకి సంబంధించి సదరు బౌలర్ మాట్లాడుతూ… షాహిద్ అఫ్రిది లాంటి దిగ్గజ క్రికెటర్ కు గౌరవం ఇవ్వడం ఎంతో ముఖ్యమని దేశానికి ఎన్నో విజయాలను అందించాడని గౌరవసూచకంగా దండం పెట్టానని వికెట్ తీసినందుకు తాను క్షమాపణలు చెప్పలేదని ఆయన తెలిపాడు.

ఈ వ్యాఖ్యలపై షాహిద్ అఫ్రిది కూడా స్పందించాడు.ఈ వీడియోని సాహిద్ ఆఫ్రిదీ రీట్వీట్ చేస్తూ అతను వేసింది చాలా మంచి వర్కర్ దయచేసి నెక్స్ట్ టైం కొంచెం మెల్లగా బాల్ వేయి.

ఫైనల్ చేరిన లాహోర్ కాలండర్స్ కు అభినందనలు అంటూ ట్వీట్ పూర్వకంగా తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube