వైరల్ వీడియో: ఆ పిల్లిని తెగ ఆడేసుకున్న పక్షులు..!

ఈ ప్రపంచంలో ఏ క్షణంలో ఏం జరిగినా అది సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది.ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రతి ఒక్కటీ నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.

 Viral Video Birds Fight With The Cat Attacked On Birds Nest-TeluguStop.com

తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది.ప్రస్తుతం ఆ వీడియోను నెటిజన్లు చాలా మంది తెగ ఇష్టపడుతున్నారు.

కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు.సాధారణంగా జంతువులు, పక్షులు తమకు ఆపద వస్తే పోరాడటానికి సిద్దపడుతాయి.

 Viral Video Birds Fight With The Cat Attacked On Birds Nest-వైరల్ వీడియో: ఆ పిల్లిని తెగ ఆడేసుకున్న పక్షులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమకు ఇబ్బంది కలిగించేవారు ఎవరైనా సరే వారిని ముప్పుతిప్పలు పెట్టడానికి చూస్తాయి.తమ పిల్లలకు ఏవైనా జరిగితే తట్టుకోలేవు.

వెంటనే తమ తోటి పక్షులతోనో, జంతువులతోనే ప్రత్యర్థులకు ఎదురొడ్డి పోరాటం చేస్తాయి.సాద్యమైనంత వరకూ వాటితో పోరాడి గెలవడానికి ప్రయత్నిస్తాయి.

ఇక్కడ కూడా అలాగే జరిగింది.

పక్షి తమ గూడును నిర్మించుకుని ఉంది.

పక్షులు సాధారణంగా తమకు అనువైన చోటును ఎంపిక చేసుకుని గూడును నిర్మించుకుంటాయి.గూడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఏర్పాటు చేసుకుంటాయి.

గాలికి, వానకు ఇబ్బంది కలగకుండా గూడును నిర్మించుకుంటాయి.తాజాగా ఇక్కడ కూడా పక్షులు ఓ గూడును నిర్మించుకున్నాయి.

అయితే ఆ గూడుపై దాడి చేయడానికి ఓ పిల్లి బయల్దేరింది.పిల్లి తన ఆహారం కోసం ఎంతటిపనినైనా చేసేస్తుంది.

ఇక్కడ కూడా పిల్లి పక్షుల గూటిపై దాడి చేయడానికి సిద్దమైంది.పెద్ద వంతెనపై నిర్మించుకుని ఉన్న ఆ గూడుపై దాడి చేయడానికి ఆహారం కోసం అక్కడికి చేరుకుంది.అయితే ఆ గూడు యజమానులు అయిన పక్షులు పిల్లిని చూసి ఊరుకోలేదు.వెంటనే దానిపై దాడి చేయడానికి సిద్దమైయ్యాయి.పిల్లిని వెనక నుంచి ఒకటి ముందు నుంచి మరోకటి పొడుస్తూ దానిని భయపెట్టాయి.కొంత సమయం వరకూ ఎదురుచూసిన పిల్లి ఆ తర్వాత అక్కడి నుంచి పరార్ అయ్యింది.

ఈ వీడియోను బ్యూటెంగేబీడెన్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Social Media #Birds Vs Cat #Cat Video #Birds Fight #Viral Ivideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు