వైరల్ వీడియో: సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొత్తరకం డాన్స్..!  

Combination Of Bharatanatyam And Hip Hop Dance Viral, Hybrid Bharatham, Viral Video, Social Media, Paris based sister dancer , Paris - Telugu Combination Of Bharatanatyam And Hip Hop Dance Viral, Hybrid Bharatham, Paris, Paris Based Sister Dancer, Social Media, Viral Video

మన భారతదేశంలో ఎన్నో రకాల నృత్యాలు పేరు పొందినాయి.కళలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో భరత నాట్యం ఎంతో ప్రాముఖ్యం చెందింది.

TeluguStop.com - Viral Video Bharathanatyam Hip Hop Dance Combination

వేల మంది కళాకారులు ఈ నాట్యం నేర్చుకుని వివిధ దేశాలలో భరత నాట్య ప్రదర్శనలు ఇస్తూ పేరు తెచ్చుకున్న వారు ఎందరో.మన భారతదేశంలో భరతనాట్యం ఏ విధంగా ఫేమస్ అయ్యిందో అమెరికా దేశంలో హిప్-హాప్ అనే డాన్స్ కూడా అంతే ఫేమస్.

అయితే ఓ ఆంగ్లో-ఇండియన్ కొత్తగా ఆలోచించి భరతనాట్యాన్ని హిప్-హాప్ రెండింటిని మేళవించి ఓ కొత్త రకమైన డాన్స్ ను ప్రదర్శించారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

TeluguStop.com - వైరల్ వీడియో: సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొత్తరకం డాన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image

వీటికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

భారతదేశ చీరకట్టుతో, మరోవైపు అమెరికన్ వస్త్రధారణ కలగలిపి ఉండేలా వస్త్రధారణ చేసుకొని ఈ డాన్స్ కు కొత్తదనం మేళవించారు.ఉష అనే మహిళ తన మిత్రురాలితో కలిసి ఈ కొత్తరకం డాన్సును సోషల్ మీడియా ను ఫ్లాట్ఫామ్ గా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు.

ఉష ఆమె ఫ్రెండ్ ఓర్లేన్ భరతనాట్యం, హిప్-హాప్ సాంగ్స్ కలిపి ఓ కొత్త డాన్స్ వీడియో ను రూపొందించారు.ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా బాగా వైరల్ గా మారింది.

అయితే ఈ డాన్స్ చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది.దీన్ని చూసి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.నిజానికి భరతనాట్యం, హిప్-హాప్ డాన్సు రెండు వేరు వేరు రకాల నృత్యాలు.అంతేకాక భారతదేశ సాంప్రదాయబద్ధంగా జరిపే డాన్స్ ఒకటి, మరొకటి అమెరికా దేశంలో కుర్రకారు ఉర్రూతలూగించే చేసే డాన్స్ ఒకటి.

కానీ, ఉష తన స్నేహితురాలు మాత్రం ఈ రెండింటిని ఒక చోటికి తీసుకు వచ్చి వాటిని కలిపి డాన్సులు చేయడం నిజంగా అబ్బురపరిచే విషయం.వీరు డాన్స్ చేయడమే కాదు అందరితో శభాష్ అనిపించుకొనేలా ఈ డాన్స్ చేయడం నిజంగా అభినందించే విషయమే.

ఇక ఈ వీడియోకి ఉష ” హైబ్రిడ్ భారతం “ అని పేరు పెట్టి పోస్ట్ చేసింది.గత రెండు నెలల నుంచి ఆవిడ యూట్యూబ్ లో ఒక ఛానల్ మొదలు పెట్టి అందులో ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది.

ఇక ఈ విషయంపై ఉష స్పందిస్తూ తనకు భరత నాట్యం పట్ల తనకి ఎనలేని ప్రేమ ఉందని.కాకపోతే, తానేమి భరతనాట్యంలో నిపుణురాలుని కాదని తెలుపుతూనే తాను రెండు డిఫరెంట్ జోనర్ లకు సంబంధించి నృత్యం తయారు చేయడం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.

#CombinationOf #Paris #Social Media #ParisBased #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Bharathanatyam Hip Hop Dance Combination Related Telugu News,Photos/Pics,Images..