వైరల్ వీడియో: పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసిన బెంగాల్ ముఖ్యమంత్రి..!

మమతా బెనర్జీ పేరు తెలియని వారు ఉండరు.బెంగాల్ సీఎంగా భారత రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నది.

 Viral Video Bengal Chief Minister Dancing At A Wedding Mamatha Benerji, Dance Vi-TeluguStop.com

అంతేకాదు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచినది మమతా బెనర్జి.ఈ బెంగాల్ సీఎం తన ప్రత్యర్థి పార్టీలను విమర్శించడమే కాదు, అక్కడ ప్రజలతో కూడా కలిసి మెలిసి ఉంటారు.

అంతేకాకుండా సీఎం హోదాలో ఉన్నాగాని నేరుగా ప్రజలకు వద్దకు పాలన లాగా వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారు.మమతా బెనర్జీ ఏమి చేసినగాని అది సరికొత్తగా ట్రెండీగా ఉంటుంది.

అయితే ఇప్పుడు ఈ బెంగాల్ సీఎం చేసిన డాన్స్ వైరల్ గా మారింది.సీఎం డాన్స్ చేయడం ఏంటి ? అనుకుంటున్నారా ? నిజమే మమతా మేనర్జి ఒక వివాహ వేడుకలో పాల్గొని అక్కడ వాళ్ళతో కలిసి నృత్యం చేసారు.

వివరాలలోకి వెళితే అలీపూర్‌ దౌర్ జిల్లా ఫలాకటాలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు మమతా బెనర్జీ హాజరయ్యారు.అక్కడ 300 గిరిజన జంటలకు తన చేతుల మీదుగా వివాహం జరిపించి వాళ్లను ఒక్కటి చేసారు.వివాహల అనంతరం అక్కడ ఉన్న గిరిజన కళాకారులతో కలిసి చిందేశారు మమతా బెనర్జీ.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాల్ వైరల్‌గా మారింది.ఆ వీడియో చూసి పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

మమతా బెనర్జీ ఏంటిది ? ఎన్నికల వేళ గిరిజన నృత్యమేంటి ? అవసరమయితే మైకేల్ జాక్సన్ లాగా మూన్ వాక్ కూడా చేస్తారని సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.అయితే పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను అన్నీ పార్టీ ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఈ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య నిత్యం విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ డాన్స్ వేయడం పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube