వైర‌ల్ వీడియో.. రోడ్డు దాట‌మంటే అల్ల‌రి చేస్తున్న ఎలుగు బంటి పిల్లలు..

చిన్న‌ప్పుడు ఎవ్వ‌రైనా స‌రే త‌ల్లిని బాగానే ఇబ్బంది పెడుతుంటారు.పిల్ల‌లు చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు.

 Viral Video  Bear Cubs Rioting Across The Road , Viral Video , Bear , Bear  Chil-TeluguStop.com

వారి అల్ల‌రిని భ‌రించాలంటే చాలా ఓపిక ఉండాలి.లేక‌పోతే వారిని త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం.

అయితే పిల్ల‌లు అంటే కేవ‌లం మ‌నుషుల్లోనే కాకుండా జంతువుల పిల్ల‌లు కూడా చాలా అల్ల‌రి చేస్తుంటాయి.చిన్న పెద్ద జంతువులు అనే తేడా లేకుండా ప్ర‌తి జంతువు పిల్ల‌లు కూడా త‌ల్లి ద‌గ్గ‌ర కొంత అల్ల‌రి చేస్తుంటాయి.

సాధు జంతువుల ద‌గ్గ‌రి నుంచి క్రూర మృగాల దాకా ఇలా ప్ర‌తి జంతువు పిల్ల‌లు కొంత మారాం చేయ‌డం కామ‌న్‌.

అయితే ఇలా జంతువుల పిల్ల‌లు చేసే అల్ల‌రికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగానే వైర‌ల్ అవుతుంటాయి.

వీటికి వ్యూస్ కూడా బాగానే వ‌స్తుంటాయి.ఇప్పుడు కూడా ఓ వీడియో ఇలాగే అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

దీనిపై చాలా ఫ‌న్నీ కామెంట్లు వ‌స్తున్నాయి.అది కూడా ఎలుగు బంటి పిల్ల‌లు అల్ల‌రి చేయ‌డం ఈ వీడియోలో మ‌నం చూడొచ్చు.

ఈ వీడియోలో ఓ ఎలుగు బంటి త‌న పిల్ల‌ల‌ను రోడ్డు దాటించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.త‌ల్లి వెంట నాలుగు పిల్ల‌లు రోడ్డు దాటేందుకు వ‌స్తున్నాయి.

అయితే ఇందులో ఒక‌టి అక్క‌డే ఆగిపోయింది.

మిగ‌తా మూడు మాత్రం అవ‌త‌లి వైపుకు దాటాయి.ఇక‌పోతే ఇవ‌త‌లి వైపు ఆగిపోయిన పిల్ల మాత్రం స్తంభం ఎక్కేందుకు చూస్తుంది.ఇది గ‌మ‌నించిన త‌ల్లి ఆ మూడింటిని అక్క‌డే వ‌దిలి ఇవ‌త‌లి వైపుకు వ‌స్తుంది.

ఇలా ఎలుగు వెన‌కాలే మ‌రో పిల్ల కూడా ఇటువైపు దాటుతుంది. ఈ స్తంభం ఎక్కుతున్న పిల్ల‌తో పాటు మ‌రొక‌టి రావ‌డంతో దేన్ని ముందు తీసుకెళ్లాలో ఎలుగుకు అర్థం కాలేదు.

ఇక ఓ పిల్లను నోట క‌రుచుకుని తీసుకెళ్లింది.దీంతో మిగిలిన పిల్ల కూడా దాని వెన‌కాలే వ‌స్తుంది.

ఇలా అన్నీక‌లిసి రోడ్డు దాటుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube