వైరల్ వీడియో: గ్రౌండ్ లోనే పని కానిచ్చిన బ్యాట్స్మెన్..!

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ (Big Bash League) జరుగుతోంది.తాజాగా సిడ్నీ థండర్, బ్రిస్బెన్ హీట్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది.

 Big Bash League, Australia Match, Viral Latest, Viral Video, Batsman, Stadium, U-TeluguStop.com

అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది.

ఈ వీడియోలో ఆస్ట్రేలియన్ క్రికెటర్, సిడ్నీ థండర్ బ్యాట్స్ మ్యాన్ అయిన ఉస్మాన్ ఖావజా తన ప్యాంట్ విప్పడం చూడొచ్చు.ఆ తర్వాత తాను విరిగిపోయిన తన పొత్తికడుపు గార్డ్ ని చూపిస్తూ కొత్త గార్డ్ తేవాలని డ్రెస్సింగ్ రూమ్ స్టాఫ్ ని అడగటం చూడొచ్చు.
అయితే ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా గ్రౌండ్ లోనే అందరూ చూస్తుండగా తన ప్యాంట్ ని విప్పలేదు.కానీ ఉస్మాన్ మాత్రం తన ప్యాంట్ ని విప్పి లో- దుస్తులలో నుంచొని గార్డ్ మార్చుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.

కామెంట్రీ చెప్పేవారు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతూ పగలబడి నవ్వారు.నిన్న జరిగిన మ్యాచ్ లో 9వ ఓవర్ తర్వాత విరామం దొరకడంతో ఉస్మాన్ ఖావజా ప్యాంట్ విప్పుతుంటే అంపైర్లు కూడా ఏం జరగబోతోందని నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంతో చూశారు.

అయితే ఈ వీడియో ని సెవెన్ క్రికెట్ అనే ఓ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది.అయితే ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది.ఇదేంటి అందరూ చూస్తుండగానే ప్యాంట్ విప్పేస్తున్నాడు అంటూ ఉస్మాన్ పై నెటిజన్ల సెటైర్లు పేల్చుతున్నారు.ఇకపోతే ఈ మ్యాచ్ లో బ్రిస్బెన్ హీట్ ఏడు వికెట్ల తేడాతో సిడ్నీ థండర్ పై ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది.అయితే 159 లక్ష్య ఛేదన తో బరిలోకి దిగిన బ్రిస్బెన్ హీట్ 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube