వైరల్ వీడియో: పరుగు తీస్తుండగా పడిపోయిన బ్యాట్స్మెన్.. మానవత్వం చాటిన ప్రత్యర్థి టీమ్..!

మనకు జీవితంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా, ఏ రకమైనా బాధా కలిగిన అందరూ చెప్పే మాట స్పోర్టీవ్ గా తీసుకోవాలి.ఆటలు జీవితాన్ని అలా ప్రతిభింబిస్తాయి.

 Viral Video: Batsmen Who Fell While Running Humane Opponent Team ..! Batsman, I-TeluguStop.com

అయితే క్రీడాకారుల్లో కూడా ఓ రకమైన సెల్ప్ మోటివేషన్, ఎమోషన్స్ అనేవి దాగుంటాయి.తాజాగా వాటికి సంబంధించిన ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లు గాయాల పాలు కావడం సర్వసాధారణమే.ఇది ప్రతి మ్యాచ్ లోనూ జరుగుతూనే ఉంటుంది.

బ్యాట్స్‌మెన్సు పరుగులు తీస్తున్న సమయంలో గాయాలు పాలు అయ్యి ఆట ఆడలేని స్థితిలో వెనక్కి వెళ్లిపోయిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.ఇలా బ్యాట్స్మెన్ రన్స్ తీస్తున్న సమయంలో గాయాలపాలు అయ్యి అక్కడే ఆగిపోయినప్పుడు ప్రత్యర్థి జట్టు ఆ బ్యాట్స్మెన్ ను ఔట్ చేసిన సందర్భాలు అనేవి చాలానే ఉన్నాయి.

రన్ అవుట్ చేసి ఆ వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్న సందర్భాలు ఉన్నాయి.అయితే ఇక్కడ జరిగిన ఓ మ్యాచ్ లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

యార్క్‌ షైర్, లాంక‌షైర్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ లో మరొ రకమైన ఘటన అనేది చోటుచేసుకుంది.

రన్స్ తీస్తున్న టైంలో లాంక‌షైర్ జట్టు బ్యాట్స్‌మ‌న్‌ అయిన స్టీవెన్ క్రాఫ్ట్ కిందపడి గాయాలపాలయ్యాడు.

అతని కాలుకు గాయం కావడం వల్ల పరుగులు తీయలేకపోయాడు.కనీసం నిలబడలేకపోయాడు.

ఆ సమయంలో గాయాలపాలై కిందపడిపోయిన బ్యాట్స్మ‌న్‌ ను ర‌నౌట్ చేయవద్దని కెప్టెన్ జో రూట్ తమ జట్టుకు సంకేతాలిచ్చాడు.దీంతో కీపర్ బాల్ ను తన చేతిలోనే పట్టుకొని ఉండిపోవడంతో కెప్టెన్ జో రూట్ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇదీ అస‌లు సిసలైన క్రీడాస్ఫూర్తి అంటూ నెటిజ‌న్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.లాంక‌షైర్ టీమ్ 18 బాల్స్ లో 15 రన్స్ చేయాల్సి ఉంది.అయితే స్టీవెన్ క్రాఫ్ట్ ని అవుట్ చేస్తే యార్క్‌ షైర్ గెలవచ్చు.అయితే ఆ జట్టు కెప్టెన్ రన్ అవుట్ చేయకపోవడంతో టీమ్ విజయం సాధించలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube