వైరల్ వీడియో: ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయిన బ్యాట్స్మెన్..!- Viral Video Batsmen Out Twice For The Same Ball

viral video batsmen out twice for the same ball, viral video, wickets, bowlers, 2 wickets, one ball, batsman, cricket - Telugu 2 Wickets, Batsman, Bowlers, Cricket, One Ball, Viral Video, Wickets.

క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంతసేపు ఆటగాళ్ళు వారి అభిమానులను అలరించేందుకు వారి దగ్గర స్థాయిని నిరూపించుకుంటూ ఉంటారు.అయితే ఇందులో భాగంగానే అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ లలో కొన్ని అనుకోని, వింత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.

 Viral Video Batsmen Out Twice For The Same Ball-TeluguStop.com

అప్పుడప్పుడు కొందరు బ్యాట్స్మెన్లు అనుకోని కారణాల వల్ల అవుట్ అవుతూ ఉంటారు.అయితే ఎన్ని వింత సంఘటనలు జరిగిన క్రికెట్ లో ఒక బంతికి ఒక క్రికెటర్ అవుట్ అవుతాడు.

అయితే తాజాగా ఓకే ఆటగాడు ఓకే బంతికి రెండు సార్లు అవుటయ్యాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే

 Viral Video Batsmen Out Twice For The Same Ball-వైరల్ వీడియో: ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయిన బ్యాట్స్మెన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ మ్యాచ్లో అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో బాగంగా అందులో అడిలైడ్ టీం ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ క్రమంలో పదోవ ఓవర్ లో జరుగుతున్న సమయంలో ఫీల్ సాల్ట్ బ్యాట్స్మెన్ బంతిని ఎదుర్కొనగా ఆ బంతి నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న బౌలర్ చేతులకు తాకుతూ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న వికెట్లను తాకింది.అలా తాకడంతో నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు.

కాకపోతే, తాను అవుట్ అయినట్లు ఆ బ్యాట్స్మెన్ కి తెలియదు.

దీంతో ఆ బ్యాట్స్మెన్ పరుగు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో పరుగు కోసం పరిగెత్తగా వికెట్ కీపర్ ఎండ్ కు చేరుకునే ప్రయత్నంలో అతడు మరోసారి రనౌట్ అయ్యాడు.

ఇంకేముంది ఎప్పుడూ లేనంతగా ఒకే బంతికి ఒకే వ్యక్తి రెండు సార్లు అవుట్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.మొట్టమొదటి సారిగా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో అయితే బౌలర్ చేతి వేళ్ళను తాకుతూ వికెట్లను తాకిన సమయంలోనే అవుట్ అవడంతో ఆ విధంగానే థర్డ్ అంపైర్ అతని నిర్ణయాన్ని తెలిపాడు.

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసేయండి.

.

#Cricket #Batsman #Wickets. #2 Wickets #Bowlers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు