వైరల్ వీడియో: ఒకటిన్నర నిమిషాల్లోనే చిన్నారి గిన్నీస్ రికార్డ్

పిల్లలను చిన్న వయసు నుండే ప్రోత్సహించాలి.మన పిల్లలో ఎటువంటి టాలెంట్ ఉందో మనం తెలుసుకొని ఆ దిశగా వారిని ప్రోత్సాహించాలి.

 Viral Video Baby Guinness World Record On Rubiks Cube In One And A Half Minutes-TeluguStop.com

తల్లిదండ్రులు ఇంకా దగ్గరుండి వారిని ప్రోత్సహిస్తే దానిని మనం తెలుసుకొని సానబడితే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు.అప్పుడు పిల్లలు చరిత్ర సృష్టించే వ్యక్తులుగా ఎదుగుతారు.

ఇలా ఓ పిల్లాడు ఒకటిన్నర నిమిషాల్లోనే రూబీక్ క్యూబ్ ను సాల్వ్ చేసి గిన్నీస్ రికార్డులలోకి ఎక్కాడు.ఇక అసలు విషయంలోకి వెళ్తే బెంగుళూరుకు చెందిన అధర్వ్ భట్ అనే పిల్లాడు ఒకటిన్నర నిమిషాల్లోనే రూబిక్ క్యూబ్ ను సాల్వ్ చేసి అందరినీ అబ్బుర పరిచాడు.

సాల్వ్ చేయడమంటే రెండు చేతులతోనే చేయడం కాదు.మామూలుగా అయితే రెండు చేతులతోనే చేయడం కష్టం.

కాని ఈ చిన్నారి రెండు చేతులతో ఒక క్యూబ్ ను, పాదాలతో ఒక క్యూబ్ ను సాల్వ్ చేసి ఒక్కసారిగా తన టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఈ వీడియోను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక పేజీలో పోస్ట్ చేసింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.చిన్నారి ప్రతిభను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

నెటిజన్లను ఎంతగానో అబ్బురపరిచిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube