వైరల్ వీడియో: ఫీల్డింగ్ చేస్తూ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేస్తున్న డేవిడ్ భాయ్..!  

తాజాగా ఆస్ట్రేలియా దేశంలో టీమ్ ఇండియా – ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరిగింది.ఇందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది.

TeluguStop.com - Viral Video Australia Cricketer Butta Bomma Dance On Field

ఆస్ట్రేలియా టీం తరపున ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ సెంచరీలు సాధించగా డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 308 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో ఆస్ట్రేలియా 66 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.

TeluguStop.com - వైరల్ వీడియో: ఫీల్డింగ్ చేస్తూ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేస్తున్న డేవిడ్ భాయ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది.

బ్యాటింగ్ లో 70 పరుగులు సాధించిన డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో టాలీవుడ్ సినిమా అలా వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేస్తూ కనిపించాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో కి సంబంధించి తాజాగా సన్ రైజర్స్ యాజమాన్యం స్పందించింది.ప్లేస్ మారిందంతే.బుట్టబొమ్మ మీద ప్రేమ మారలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్టు అయిన సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ గత కొన్ని నెలల నుండి టాలీవుడ్ లో ప్రముఖంగా హిట్ అయిన పాటలను ఎంచుకొని తనదైన శైలిలో డాన్సులు వేస్తూ తెలుగు క్రికెట్ అభిమానులను, అలాగే సినీ ప్రేమికులను ఉత్సాహపరుస్తూన్న సంగతి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం గ్రౌండ్ లో బుట్ట బొమ్మ స్టెప్పులు వేసిన వీడియో చూసి ఎంతో మంది నెటిజన్స్ డేవిడ్ వార్నర్ ను తెగ మెచ్చుకుంటున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

#Social Media #Dawid Warner #Viral Video #David Warner #@davidwarner31

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Viral Video Australia Cricketer Butta Bomma Dance On Field Related Telugu News,Photos/Pics,Images..