వైరల్ వీడియో: ట్రాఫిక్ పోలీస్ ను కారుతో ఢీ కొట్టడమే కాకుండా ఏకంగా ...?!

తాజాగా ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.

 Traffic Police, Car, Nagpur, 500 Meters, Viral Video, Social Media, Car Driver O-TeluguStop.com

రోడ్డుపై ఓ వ్యక్తి తనకు ఇష్టం వచ్చినట్లుగా ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా కార్ ను నడిపినందుకు అడ్డుకోబోయిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఏకంగా కారుతో గుద్దడమే కాకుండా అమాంతం అతడిని అలాగే కారుతో లాక్కొని వెళ్ళిన ఈ సంఘటన ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

మహారాష్ట్రలోని నాగపూర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి కారు నడుపుతున్న సమయంలో పోలీస్ కానిస్టేబుల్ అతడిని ఆపడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై కారు డ్రైవర్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు.

దీంతో ఆ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆ కారు యొక్క బెన్నెట్ ను గట్టిగా పట్టుకోవడంతో అతడు ప్రాణాలను కాపాడుకున్నాడు లేకపోతే ఆ కారు కింద ట్రాఫిక్ కానిస్టేబుల్ పడి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేదో.

ఇంత జరుగుతున్న ఆ కారు డ్రైవర్ మాత్రం ఆ కారుని ఎంతకీ ఆపలేదు.కారుని వేగంగా నడుపుతూ కానిస్టేబుల్ ని కింద పడేసే ప్రయత్నం చేశాడు.అంతేకాదు రోడ్డుపై తనకు అడ్డం వచ్చిన వాహనాలను సైతం ఢీ కొడుతూ ముందుకు సాగాడు.

ఇదే సమయంలో ఆ కారు ఓ వాహనాన్ని సైతం ఢీ కొట్టడం సీసీ కెమెరాలో రికార్డయింది.దీంతో ఆ బైక్ పై ఉన్నవారు కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు అయింది.

ఆ కారు డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా 500 మీటర్ల వరకు కారు ముందు భాగంలో ఉంచి తీసుకు వెళ్ళాడు.ఇలా చివరికి పోలీసులు ఆ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఘటనకు ఆధారంగా నగరంలోని పలు సిసి కెమెరాల్లో ఈ సన్నివేశాలు రికార్డయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube