సినిమా పరిశ్రమలో ప్రవేశించాక సినిమాలలో నటించడానికి అవకాశం రావాలంటే ముందుగా ఆ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ కీలకమైన పాత్రల నుండి మొదలు కొన్ని చిన్న చిన్న పాత్రల వరకు ఆడిషన్ తీసుకుంటాడు.తద్వారా ఎవరి యాక్టింగ్ కేపాసిటీ ఏమిటి అన్నది అంతేకాక ఆ సదరు సినిమాకు సంబంధించిన పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుందనే దానిపై డైరెక్టర్ కు ఒక క్లారిటీ వస్తుంది.
అయితే మనం ఇప్పటి స్టార్ హీరో, హీరోయిన్ ల సినిమా ఆడిషన్ ను మనం చూసి ఉండము.అవి పెద్దగా బయటికి రావు కూడా.
కాని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఓ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.త్రీ ఇడియట్స్ సినిమా కోసం అనుష్క ఈ ఆడిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
చక్కటి హావభావాలతో అనుష్క ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.బిగ్ బ్లాక్ బస్టర్ అయిన త్రీ ఇడియట్స్ సినిమాకు ముందు ఇంత కసరత్తు జరిగిందా అని సామాన్య సినీ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి మరి.