వైరల్ వీడియో: ఏటీఎంలో నగదు రాలేదని కోపంతో ఏకంగా..?!

ఏ బ్యాంకులో అయినా సరే మన సేవింగ్ అకౌంట్ లో కనీస మోతాదులో డబ్బులు ఉంచకపోతే ఆ బ్యాంకు ఖచ్చితంగా జరిమానా విధించడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే కస్టమర్ నుంచి జరిమానాలు తీసుకోవడమే తప్ప వారి బ్యాంకు సేవలను మాత్రం కొద్దిగా కూడా ఏ మాత్రం పురోగతి చూపించట్లేదు కొన్ని బ్యాంకులు.

 Viral Video Angry That Cash Did Not Come In The Atm-TeluguStop.com

ప్రజలకు అవసరమైన నగదును వారి ఏటీఎంలలో ఉంచాలన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బ్యాంకింగ్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి బ్యాంకులు.కస్టమర్ల బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ వసూలు చేసే బ్యాంకులకు వారు ఏటీఎంలలో నగదు లేకపోతే ప్రజలు వారి నుంచి ఎంత మొత్తంలో ఫైన్ వసూలు చేయాలో మరి.ఇకపోతే ఎవరికైనా ఏటీఎం సెంటర్ కి వెళ్లి నగదు ఉపసంహరించుకోవాలి అంటే చాలా చోట్ల ఈ మధ్యకాలంలో అవుట్ ఆఫ్ సర్వీస్ అని చూపించడం పరిపాటుగా మారిపోయింది.ఇది చూసిన వెంటనే సగటు కస్టమర్ కి బ్యాంకుపై ఉన్న నమ్మకం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

డబ్బుల కోసం ఏటీఎం సెంటర్ కి వెళ్తే ఏటీఎం పని చేయకపోతే కాస్తోకూస్తో కస్టమర్ కి కోపం రావడం సహజం.అయితే తాజాగా కేరళ రాష్ట్రంలోని కొచ్చి యూనివర్సిటీలో ఓ ఏటీఎం కి ఓ దుండగుడు ఏకంగా నిప్పంటించాడు.

 Viral Video Angry That Cash Did Not Come In The Atm-వైరల్ వీడియో: ఏటీఎంలో నగదు రాలేదని కోపంతో ఏకంగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటగా అతడు పెట్రోల్ తీసుకుని ఏటీఎంకి వచ్చాడు.అలా వచ్చిన అతడు తన బ్యాగ్ పక్కన పెట్టి తనకు అవసరం ఉందో లేదో తెలియదు కానీ.

ఏటీఎం నుండి నగదు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించాడు.

అలా విత్ డ్రా చేస్తున్న సమయంలో అతనికి డబ్బులు చేతికి రాకపోవడంతో అసహనం చెందిన అతను వెంటనే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ తీసి ఏటీఎం పై పోసేసాడు.

అలా పెట్రోల్ పోసిన తర్వాత నిప్పు అంటించి అక్కడి నుంచి పరారయ్యాడు ఆ దుండగుడు.ఈ సన్నివేశాలు అన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలలో రికార్డు అవ్వడంతో.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యాల నేపథ్యంలో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.

శుబిన్ గా నిందితుడిని పోలీసులు గుర్తించారు.అయితే ఎందుకు చేశావని నిందితున్ని పోలీసులు ప్రశ్నించగా తనకు నగదు రాలేదన్న కోపంతోనే ఇలా ఎటిఎం సెంటర్ కి నిప్పు పెట్టినట్లు అతడు తెలియజేశాడు.

#Customer #Cochi #Bank #Fire Accident

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు