వైరల్ వీడియో: అమ్మ మీద కోపంతో ఆరేళ్లుగా అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే..?!

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై కోప్ప‌డటం అనేది కామ‌న్‌.అలా అని పిల్ల‌లు వారి కోపాన్ని అర్థం చేసుకోవాలి గానీ ద్వేషాన్ని గానీ, కోపాన్ని గానీ పెంచుకోకూడ‌దు.

 Viral Video Angry Teenager Starts Digging Bunker After A Fight With His Mom , An-TeluguStop.com

అలా చేస్తే చాలా న‌ష్ట‌పోతారు.ఎందుకంటే త‌ల్లిదండ్రులు ఏది చేసినా పిల్ల‌ల కోస‌మ క‌దా.

కానీ ఓ పిల్లాడు మాత్రం అమ్మ కోప్ప‌డింద‌ని ఓ వింత ప‌ని చేశాడు.దీంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఆండ్రెస్ కాంటో అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం త‌న ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాడు.అప్పుడు బ‌ట్ట‌ల‌కు మ‌ర‌క‌లు అయ్యాయి.దీంతో ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోమని అమ్మ చెప్పింది.అవే బట్టలతో ఇంట్లోనే ఉంటానని ఆండ్రెస్ ప‌ట్టుబ‌ట్టాడు.

అయితే బెడ్ రూంలోకి వెళ్లి కూర్చోకుండా ఆ 14ఏళ్ల టీనేజర్ వేరే పని చేశాడు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఉండ‌కుండా ఏదో ఒక‌టి చేయాల‌నుకున్నాడు.

దీంతో అత‌నికి ఓ ఆలోచ‌న వ‌చ్చింది.దీంతో ఇంటి వెనుక భాగంలో గోయి తీయడం మొదలుపెట్టాడు.మధ్యాహ్నం వరకూ తవ్వి అల‌సిపోయేవాడు.

దీంతో ఇంటికి వ‌చ్చేవాడు.అలా 3ఏళ్లు త‌వ్వి దాన్ని పెద్ద గొయ్యిలాగా మార్చాడు.

ఆరేళ్ల వ‌ర‌కు చెత్త కుప్ప కింద ఓ అండర్ గ్రౌండ్ బంకర్ తయారైంది.

అందులోకి దిగ‌డానికి మెట్లు.

స్టీరియో సిస్టమ్, హీటింగ్, ఓవెన్, సింగిల్ బెడ్ ఇలా అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు.

తాను ఉండేందుకు అన్ని వ‌స్తువులు తెచ్చుకున్నాడు.ఇప్పుడు రోజు మొత్తంలో ఓ 5గంటలు రిలాక్స్ అవడానికి అందులోనే ఉంటున్నాడు ఆడ్రెస్‌.త‌న బెస్ట్ ఫ్రెండ్ డ్రిల్ సహాయంతో ఆండ్రెస్ ఇలా ఇంటి ప‌నుల‌ను స్పీడ‌ప్ చేశాడు.

నిర్విరామంగా కష్టపడి అండర్ గ్రౌండ్ స్పేస్ లాగా దాన్ని నిర్మించుకున్నాడు.ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లో బెడ్ రూం అందులో సింగిల్ బెడ్, షెల్వింగ్, నలుగురు ఫ్రెండ్లకు సీటింగ్ కూడా ఉంది.

ప్రతి వారం ఆండ్రెస్ ఫ్రెండ్స్ వచ్చి ఇందులో ఎంజాయ్ చేస్తాడు.అందులో బీర్ కూడా తాగుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube