వైరల్ వీడియో: నాకు ఉదయాన్నే ఈ వీడియో చూపించి ఏడిపించారంటున్న ఆనంద్ మహేంద్ర..!

ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చాలా సార్లు స్ఫూర్తిదాయక అంశాలను సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటారు.

 Viral Video, Anand Mahindra,  Morning, Made Me Cry, Social Media, Viral In Socia-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియోతో ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియా ముందుకు వచ్చారు.అదేంటంటే.

‘ఈ రోజు ఉదయం లేవగానే మీరు నన్ను ఏడిపించారు.నాకు మనవరాలు లేదు.

కానీ, అంత వయసు ఉన్న మనవడు ఉన్నాడు’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన వీడియో పలువురు నెటిజన్ లను కూడా కదిలిస్తోంది.ఇంతకు ఆ వీడియోలో ఏం ఉందంటే.

ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్‌ పండగ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో షూట్‌ చేసిన యాడ్‌ కు సంబంధించిన వీడియోని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

అయితే ఈ వీడియో ప్రారంభంలోనే మొదట ఒక తాత కనిపిస్తాడు.ఉదయం లేచి స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లి ఓ ఇనుప బంతిని తీసుకొస్తాడు.దాన్ని తన రూమ్‌లోకి తీసుకువచ్చి.ఓ ఫోటో ఎదురుగా నిల్చుని ఎత్తేందుకు ప్రయత్నం చేస్తాడు.

కానీ బరువు మోయలేక వెంటనే కిందకు పడేస్తాడు.అది చుసిన ఇరుగు పొరుగు వారితో పాటు ప్రేక్షకులకు కూడా ఈయన ఈ ఏజ్‌లో ఎందుకు వ్యాయామం చేస్తున్నాడా.? అనే అనుమానం మొదలువుతుంది.ఇదిలా ఉండగా.

ఆ వృద్ధుడు మరుసటి రోజు ఉదయం ఆరుబయట ఓ చిన్న కుర్చిపై ఫోటో పెట్టుకుని బరువు ఎత్తడం ప్రాక్టీస్‌ చేస్తాడు.అయితే ఈ సారి విజయం సాధిస్తాడు.

ఇలా కొన్ని రోజులు పాటు ఆయన సాధన కొనసాగిస్తాడు.ఆ తర్వాత క్రిస్టమస్‌ నాడు రెడీ అయ్యి గిఫ్ట్‌ బాక్స్‌ తీసుకుని కుమార్తె ఇంటికి వెళ్తాడు.

ఇంతలో మనవరాలు వస్తుంది.తన చేతిలోని గిఫ్ట్‌ బాక్స్‌ ని ఆమెకి ఇస్తాడు.

చిన్నారి ఆ బాక్స్‌ ఒపెన్‌ చేసి చూడగా అందులో స్టార్‌ ఉంటుంది.ఆ సమయంలో వృద్ధుడు మనవరాలిని ఎత్తుకోగా ఆమె స్టార్‌ ని తీసుకెళ్లి క్రిస్టమస్‌ ట్రీలో పెడుతుంది.కుమార్తె తండ్రిని చూసి ఆనందంతో కంటతడి పెడుతుంది.ఇక చివరగా వృద్ధుడు మొదట్లో చూపించే ఫోటోని రివీల్‌ చేస్తారు.దానిలో అతడి మనవరాలు ఉంటుంది.అంటే క్రిస్టమస్ కు వచ్చే తన మనవరాలిని ఎత్తుకోవడానికి ఆ పెద్దయన ముందు నుంచి బరువు ఎత్తడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నమాట.

రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.ఇక ఆనంద్‌ మహీంద్రా దీన్ని షేర్‌ చేసిన గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో దీన్ని వీక్షించారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube