వైరల్ వీడియో: అనకొండ కు దొరికి ప్రాణాలను దక్కించుకున్న ఘనుడు..!

అనకొండ పట్టు కి చిక్కితే ప్రాణాలను కోల్పోవాల్సిసిందే.నిజానికి అనకొండ పాములు మనుషుల జోలికి రావు.మేకలను, గొర్రెలను తదితర జంతువులను బలంగా చుట్టుకొని వాటిని చంపేసి తింటాయి.15-20 అడుగులు ఉన్న అనకొండ పాములు మాత్రం మనుషులను చంపగలవు.మనిషి శరీరం మొత్తాన్ని మింగేయగలవు.మనుషులను అనకొండలు చంపేసి మింగేసాయన్న వార్తలను మనం వింటూనే ఉన్నాం.ఊపిరాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేయగల అనకొండ పాము లకు దూరంగా ఉండటం మంచిది కానీ ఇండోనేషియా కి చెందిన ఒక యువకుడు తెలిసో తెలియకో ఒక అనకొండ వద్దకు వెళ్ళాడు.

 Viral Video Anaconda Finds Survivor, Phyton, Viral Latest, Viral Video, Life, So-TeluguStop.com

అయితే నల్లగా, చాలా పెద్దగా ఉన్న ఆ అనకొండ పాము యువకుడి నడుముచుట్టు చుట్టుకుంది.

మొదటిగా మోకాళ్ళను చుట్టుకొని కింద పడేసి ఆ తర్వాత నడుముకు చుట్టుకొని చంపేయడానికి అనకొండ సిద్ధమయ్యింది.అయితే ఆ యువకుడు అనకొండ నోటిని గట్టిగా పట్టుకొని.పట్టు నుంచి విడిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు కానీ తన ఒక్కడి వల్ల కాలేదు.పాము చాలా పెద్దగా మరియు బలంగా ఉండటంతో యువకుడు తన ప్రాణాలు పోతాయని ఆశల వదిలేసుకున్నాడు.

ఈ సమయంలోనే ఇద్దరూ స్థానిక వ్యక్తులు ఘటనా స్థలానికి వచ్చి పాముని బలంగా పక్కకునెట్టి యువకుడిని కాపాడగలిగారు.

ఒకవేళ ఆ యువకుడిని ఎవరూ చూడకపోతే ఇప్పటికల్లా ఆ యువకుడు అనుకొండ కు పలహారం అయ్యేవాడు.

అయితే ఈ యువకుడు అనకొండ పట్టు లో చిక్కి ప్రాణాల కాపాడుకోవటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు ఓ వీడియోలో చిత్రీకరించబడ్డాయి.కొందరు ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అయితే అనకొండ ఓ యువకుడి ని చంపడానికి ప్రయత్నిస్తుంటే.ఏమవుతుందో అన్న ఉత్కంఠతో నెటిజన్లు వీడియోని చూడడానికి బాగా ఆసక్తిని కనబరిచారు.

ఏదేమైనా అనకొండ ని ఫారెస్ట్ అధికారులకి అప్పగించారా లేదా అన్న విషయం ఇంకా తెలియ రాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube