వైరల్ వీడియో : 15 అడుగుల లోతైన బావిలో పడిన ఏనుగుపిల్ల‌..ఏమైందంటే..!?

మనం ఎక్కువగా సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు, సింహాలు, ఏనుగులకు  సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.తాజాగా ఒక గున్న ఏనుగు కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

 Viral Video An Elephant Calf That Fell Into A 15 Feet Deep Well Because-TeluguStop.com

ఆ గున్న ఏనుగు దారి తప్పి 15 అడుగుల లోతైన బావిలో పడిపోయింది,   అది గమనించిన గ్రామస్థులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయడంతో సహాయ చర్యలు మొదలు పెట్టారు.

ఈ సంఘటన ఒడిషాలోని మయూర్‌ భంజ్‌ లో చోటుచేసుకుంది.

 Viral Video An Elephant Calf That Fell Into A 15 Feet Deep Well Because-వైరల్ వీడియో : 15 అడుగుల లోతైన బావిలో పడిన ఏనుగుపిల్ల‌..ఏమైందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సహాయ చర్యలో భాగంగా ముందుగా అగ్నిమాపక సిబ్బంది పాడుబడ్డ బావి సమాంతరంగా గొయ్యిని తొవ్వరు .అనంతరం బుల్డోజర్ సహాయంతో ఆ గున్న ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు.వాస్తవానికి బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఒక ఏనుగుల గుంపు ఒడిశా లోకి వచ్చింది.

ఆ గుంపులో భాగమైన ఒక ఏనుగు పిల్ల అనుకోకుండా 15 అడుగుల లోతైన బావిలో పడిపోవడంతో, బిడ్డను కాపాడుకోవడానికి తల్లి ఏనుగు  ఎంత ప్రయత్నించినా కానీ అది సాధ్యం కాలేదు.

తన బిడ్డ కోసం తల్లి ఏనుగు చాలా సేపు బావి దగ్గర వేచి ఉన్నా కానీ ఎటువంటి లాభం లేకపోవడం గమనించిన  స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో సురక్షితంగా బయటికి తీశారు.సురక్షితంగా బయటకు తీసిన ఆ గున్న ఏనుగును తల్లి దగ్గరకు శాఖ అధికారులు చేర్చారు.

ఆ గున్న ఏనుగుకి ఏమి కాకపోవడంతో గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.ఈ క్రమంలో గజరాజులను కాపాడిన అటవీశాఖ, ఫైర్‌ సిబ్బందికి  అక్కడి వారు ధన్యవాదాలు తెలియజేశారు.

  ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతుంది .

#Baby Elephant #Odisha #Viral Video #Forest Officers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు