వైరల్ వీడియో: 3 అంతస్తులు ఎక్కి బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న ఎద్దు..!

ప్రస్తుత కాలంలో ఇళ్లలో మనతోపాటు సాధు జంతువులు కూడా పెరగడం సర్వసాధారణమైపోయింది.పిల్లులు, కుక్కలు ఇంకా వివిధ దేశాలలో వారి స్థాయికి తగ్గట్టుగా వన్యమృగాలను కూడా ఇంట్లోనే ఉంచి పెంచుకోవడం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా అయింది.

 Viral Video An Bull Taking Rest In Three Story Building In Madhya Pradesh-TeluguStop.com

కొందరు జంతు ప్రేమికులు వారు నిద్రిస్తున్న సమయంలో కూడా వాటిని కూడా వారి బెడ్ పై ఉంచుకొని నిద్రపోవడం గమనిస్తూ ఉంటాం.అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న మనం గమనించవచ్చు.

ఇకపోతే తాజాగా ఆవు చేసిన పనికి నెటిజన్స్ ఆశ్చర్యపోవడం జరుగుతోంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

 Viral Video An Bull Taking Rest In Three Story Building In Madhya Pradesh-వైరల్ వీడియో: 3 అంతస్తులు ఎక్కి బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న ఎద్దు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎద్దు ఏకంగా మూడు అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్ లోకి ప్రవేశించి ఏకంగా మూడు ఫ్లోర్ లో ఉన్న ఇంట్లోకి వచ్చి నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న బెడ్ పై చేరుకొని ప్రశాంతంగా నిద్ర పోయింది.ఈ సంఘటన తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా నగరంలో చోటు చేసుకుంది.

ఇంట్లో వారందరూ టీవీ చూస్తూ నిమగ్నమైన సమయంలో ఓ ఎద్దు వారి కంటపడకుండా ఇంట్లోకి ప్రవేశించి బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆ బెడ్ పై నిద్ర పోయింది.అలా నిద్రపోతున్న ఎద్దును ఒక్కసారిగా చూసిన ఇంట్లో కుటుంబ సభ్యులు హడలిపోయారు.

అందరూ ఇంట్లో ఉండగానే మూడు ఫ్లోర్లు ఎక్కి మరీ బెడ్ రూం లోకి ఎలా ప్రవేశించిందని ఆశ్చర్యపోయారు.

Telugu 3 Floor\\'s, An Ox, Bed, Bull, Madhya Pradesh, News Viral, Sleeping, Taking Rest, Three Story Building, Viral Latest, Viral Video-Latest News - Telugu

అపార్ట్మెంట్ లోని మూడు ఫ్లోర్లు ఎక్కి వారి ఇంట్లోని బెడ్ రూమ్ లోకి ప్రవేశించి అక్కడ ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటూ నోరు నెమరువేసుకుంటూ ఆ బెడ్ పై కొద్దిసేపు కునుకు తీసింది.

ఈ విషయం కాస్త నగరంలో తెలియడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు నిద్రిస్తున్న సమయంలో అలాగే ఏదైనా పనిలో ఉన్న సమయంలో ఇంటి బయట తలుపులు వేసుకొని చేసుకుంటే మంచిది.

లేకపోతే., ఎవరైనా దొంగలు ప్రవేశించి ఏదైనా అఘాయిత్యం లేదా దొంగతనాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.

#Bull #Sleeping #An Ox #ThreeStory #3 Floor's

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు