వైరల్ వీడియో: అద్భుతం, సముద్రం కింద టోర్నాడో సృష్టించిన చేపలు..

సముద్రంలో కనిపించే దృశ్యాలు మనల్ని ఎప్పుడూ అబ్బుర పరుస్తూనే ఉంటాయి.ఆకాశంలో పక్షులు ఒకేసారి కలిసి ఎగిరినట్టు సముద్రంలోని చేపలు కూడా ఒక్కోసారి గుంపుగా ప్రయాణాలు చేస్తూ కన్నుల విందు చేస్తాయి.

 Viral Video  Amazing, Fish Created By Tornado Under The Sea , Viral Latest, News-TeluguStop.com

ఈ దృశ్యాలు చూసేందుకు ఒక ఆకారంలో ఉంటూ ఆశ్చర్యపరుస్తాయి.అయితే తాజాగా ఒక చేపల గుంపు కలిసి టోర్నాడో లేదా సుడిగాలిని పోలిన ఒక అద్భుతాన్ని సముద్ర గర్భంలో క్రియేట్ చేశాయి.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ అపురూపమైన దృశ్యం ఏ సముద్రంలో కనిపించిందో తెలియరాలేదు.

ఈ వీడియోలో వేల సంఖ్యలో చిన్న చేపలు ఒకే దిశలో ఒక సమయంలో చాలా పద్ధతిగా కలిసి కదులుతున్నట్లు మీరు చూడవచ్చు.దాంతో ఒక సుడిగుండం లేదా టోర్నడో చూసినంత భ్రాంతి కలిగింది.

సముద్రం కింద నివసించే ఈ జీవులు ప్రత్యేకమైన భౌతిక లక్షణాలతో, సామర్థ్యాలతో మంత్రముగ్ధుల్ని చేశాయి.వాస్తవానికి, ఈ వీడియో జులై 7న ఇన్‌స్టాగ్రామ్‌లో జపాన్‌కు చెందిన టాట్సురో పోస్ట్ చేశారు.

సముద్ర ఫోటోగ్రాఫర్‌ అయిన టాట్సురో ఇది ఒక అద్భుత దృశ్యం అని అభివర్ణించారు.ఈ వీడియోకి ఇప్పటికే 36 లక్షలకు పైగా వ్యూస్, 2.5 లక్షల వరకు లైక్ లు వచ్చాయి.”మై గాడ్ ఇది చాలా అందమైన వీడియో.ఇది అద్భుతంగా ఉంది.ఇలాంటి అపురూప దృశ్యాలు తీసినందుకు మీకు ధన్యవాదాలు” అని ఒక నెటిజన్ కామెంట్ రాశారు.మరొకరు సింపుల్ గా “అద్భుతం” అని పేర్కొన్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube