వైరల్ వీడియో: తన బాడీతో అమ్మాయిల మతిపోగొడుతున్న అల్లు శిరీష్..!

హీరో అల్లు శిరీష్ అందరికి సుపరిచితుడే.అల్లు అరవింద్ అబ్బాయిగా, అల్లు అర్జున్ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.

 Viral Video Allu Sirish Is Fooling Girls With His Body , Allu Sirish, Movie Upda-TeluguStop.com

హీరోగా అల్లు శిరీష్ మొదట సినిమా గౌరవం.ఆ సినిమా ఆశించినంత పేరు తీసుకురాలేదు.

ఆ తర్వాత రెజీనా హీరోయిన్ గా ‘కొత్త జంట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.

ఆ తరువాత శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబిసిడి సినిమాలలో హీరోగా నటించాడు.కానీ, అన్నకి వచ్చిన గుర్తింపు తమ్ముడికి రాలేదనే చెప్పాలి.

ఏబీసీడీ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న శిరీష్ నెక్స్ట్ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ తో అందరిని అలరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దీనికోసం పూర్తిగా తనను తాను మార్చేసుకున్నాడు శిరీష్ .ఇప్పుడు కనుక మీరు అల్లు వారి అబ్బాయిని చుస్తే వారెవ్వా అని అనాల్సిందే.అంతగా మారిపోయాడు ఈయన.ముఖ్యంగా మొన్న నిహారిక పెళ్లిలో కూడా చాలా స్టైలిష్ లుక్‌ లో అందరికి కనిపించాడు.ఇక తెలుగు సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ అనడంలో అతిశయోక్తి లేదు.

అన్నబాటలోనే తమ్ముడు కూడా నడుస్తున్నాడు మరి.

ఈయన నటిస్తున్న సినిమా షూట్ కూడా దాదాపు 35 రోజులు పూర్తైపోయింది.త్వరలోనే సినిమాపై పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.తన లుక్ కి సంబందించిన ఫొటోస్ మీడియాలో ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాడు శిరీష్.ఇప్పుడు కూడా ట్విట్టర్‌ లో జిమ్ చేస్తూ సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ అందరికి షాక్ ఇచ్చాడు.సోషల్ మీడియాలో అల్లు శిరీష్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ఈయన్ని చూస్తుంటే పర్ఫెక్ట్ డైట్ పాటిస్తూ ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి సిక్స్ ప్యాక్ బాడీతో అన్నలాగా ప్రేక్షకులను అలరిస్తాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube