అభిమానులకు హాయ్ చెబుతూ క్షేమ సమాచారాన్ని అందించిన బన్నీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా సోకిన విషయం అందరికి తెలిసిందే.ఈ విషయం తెలిసి నప్పటి నుండి ఫ్యాన్స్ అల్లు అర్జున్ క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Viral Video Allu Arjun Saying Hi To His Fans As He Infected With Corona-TeluguStop.com

పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ కు కరోనా సోకింది.దీంతో ఆయన గృహ నిర్బంధం లోకి వెళ్లి పోయారు.

కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తుంది.

 Viral Video Allu Arjun Saying Hi To His Fans As He Infected With Corona-అభిమానులకు క్షేమ సమాచారాన్ని అందించిన బన్నీ.. వీడియో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ కరోనా తో పోరాడుతున్నాడు.

అయితే ఆయన బాగానే ఉన్నానని సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టిన ఫ్యాన్స్ కంగారు తగ్గలేదు.అయితే తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది.

ఇందులో అల్లు అర్జున్ టెర్రస్ పైన ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు.అంతేకాదు ఫ్యాన్స్ కు హాయ్ చెబుతూ నేను బాగానే ఉన్నాననే సమాచారాన్ని ప్రేక్షకులకు అందించాడు.

ఈ వీడియో ను అల్లు శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది.ఇప్పుడు ఈ వీడియో చుసిన బన్నీ అభిమానులు కాస్త రిలాక్స్ అవుతున్నారు.

ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తుంటే.రష్మిక మందన్న గిరిజన యువతిగా నటిస్తుంది.

ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్ నడుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గితే కానీ మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

#Viral Video #Social Media #Corona Virus #COVID-19 #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు