వీడియో వైరల్: రాహుల్‌ తో పుష్ ‌అప్స్ పోటీ పడిన టెన్త్ అమ్మాయి.. చివరకి..?!

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమిళనాడులో బిజీబిజీగా గడిపేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో ఆయన స్టైల్ లో దూసుకెళ్తున్నాడు.

 Viral Video About Rahul Pushups-TeluguStop.com

ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు.ఇదే క్రమంలో తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని ములంగుమూడులో పర్యటించిన రాహుల్ గాంధీ ఆ ఊర్లోనే ఉన్న జోసఫ్ స్కూల్ లో విద్యార్థులతో ఆయన సంభాషణ జరిపాడు.

ఇదే క్రమంలోనే రాహుల్ గాంధీ పదోతరగతి విద్యార్థులలో ఎవరికైనా సరే తనతో ఫిట్నెస్ చాలెంజ్ లో పోటీ పడతారా అని సవాల్ విసిరారు.ఇందులో భాగంగానే పదో తరగతి అమ్మాయి మెరిన్ షెలిఘో తో రాహుల్ గాంధీ కలిసి పుష్ ‌అప్స్ చేయడానికి  పోటీ పడింది.

 Viral Video About Rahul Pushups-వీడియో వైరల్: రాహుల్‌ తో పుష్ ‌అప్స్ పోటీ పడిన టెన్త్ అమ్మాయి.. చివరకి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పోటీల్లో భాగంగా పదో తరగతి అమ్మాయి అలాగే రాహుల్ గాంధీ పుష్ ‌అప్స్ చేశారు.

ప్రస్తుతం 50 సంవత్సరాలు ఉన్న రాహుల్ గాంధీ ఫిట్నెస్ విషయంలో ఎంత ఫిట్ గా ఉన్నాడొ ఈ వీడియో లో కనిపించినట్లు అయింది చూస్తే.15 సంవత్సరాలు ఉన్న వారికి కూడా దీటుగా రాహుల్ గాంధీ పుష్ ‌అప్స్ చేయడంతో ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసేయండి.

ఏది ఏమైనా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఇలాంటి వాటిని చేయడం మనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాం.ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఉంటారో మాత్రం అంతుచిక్కదు.

రాజకీయ పరంగా తమిళనాడులో ప్రస్తుతం వివిధ రకాల పార్టీలు పోటీపడుతుండగా విజయం ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాలి మరి.

#Social Media #Viral Video #Pushups #Rahul Gandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు