వైరల్‌ వీడియో : హ్యాండ్‌ శానిటైజర్‌ అనుకుని దాన్ని నొక్కిన పాకిస్తానీ  

Viral Video About Pakistani Man Suing Fire Extinguisher For Hand Wash - Telugu Corona Virus, Fire Engine Press, Pakisthan Malls, Pakisthan One Video Viral In Social Media, Telugu General News, Using Hand Wash Sanitizers,

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా గంట గంటలకు చేతులను శానిటైజర్స్‌ తో కడుక్కోవాలంటూ సూచించిన విషయం తెల్సిందే.కరోనా వైరస్‌ భారిన పడకుండా ఉండాలంటే ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా శానిటైజర్స్‌ను తప్పకుండా వాడాలంటూ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చెబుతున్న నేపథ్యంలో తాజాగా ఒక పాకిస్తానీ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 Viral Video About Pakistani Man Suing Fire Extinguisher For Hand Wash

మరీ ఇంత తెలివి తక్కువగా జనాు ఉంటారా అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

పాకిస్తాన్‌లోని ఒక మాల్‌లో వినియోగదారుడు ఒక వ్యక్తి ఫోన్‌ మాట్లాడుతూ లోనికి వెళ్లాడు.అక్కడ ఉన్న అగ్నిమాపక యంత్రంను శానిటైజర్‌ అనుకుని ప్రెస్‌ చేశాడు.దాంతో ఒక్కసారిగా తెల్లటి పొగలు కమ్ముకున్నాయి.

వైరల్‌ వీడియో : హ్యాండ్‌ శానిటైజర్‌ అనుకుని దాన్ని నొక్కిన పాకిస్తానీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అక్కడ నుండి అతడు మెల్లగా జారుకునేందుకు ప్రయత్నించాడు.ఏం జరిగిందా అంటూ సిబ్బంది అక్కడకు వచ్చి చూడగా ఫైర్‌ ఆర్పేదాన్ని ప్రెస్‌ చేసినట్లుగా గుర్తించారు.

ఎవరు ఆ పని చేశారు అంటూ అక్కడున్న వారికి ప్రశ్నించగా అతగాడు సైలెంట్‌గా ఉన్నాడట.

అప్పుడే సీసీ కెమెరాలో చూడటంతో అసు విషయం బయటకు వచ్చింది.విషయం తెలిసి అతడిని ఎందుకు ప్రెస్‌ చేశారంటూ అడగగా శానిటైజర్‌ అనుకుని ప్రెస్‌ చేశాను అన్నాడట.కరోనా వైరస్‌ కారణంగా ఇలా శానిటైజర్‌ పెట్టారేమో అనుకున్నాను అంటూ అతడు ఆశ్చర్యకరంగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది.

అతడు చేసిన పనితో అంతా కూడా అవాక్కవుతున్నారు.మొత్తానికి హ్యాండ్‌ శానిటైజర్‌తో అతడు చేతులు కడుక్కోవాలని తెలుసు కాని అది ఫైర్‌ ఎగ్జాస్టిర్‌ అని తెలుసుకోలేక పోయాడా అంటున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.దీన్ని మీరు ఒకసారి చూడండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు