ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఒకప్పుడు ఏదైనా విషయం తెలియాలంటే చాలా సమయం పట్టేది.
ఎందుకంటే అప్పట్లో మీడియా అనేది అంతగా క్షేత్ర స్థాయిలో యాక్టివ్ గా లేకపోవడం ఒక ప్రధాన కారణం.కాని ఇప్పుడు పరిస్థితి ఆలా లేదు.
ఏమి జరిగినా క్షణాల్లో ఆ విషయం ప్రపంచాన్ని చుట్టేస్తోంది.ఆ విషయం అందరికి అవగాహన లోకి వస్తుంది.
ఇక అసలు విషయం లోకి వెళ్తే మామూలుగా జంతువులు అనేవి జనావాసాల్లో ఉండటం మనం చూస్తాం.కాని కొన్ని కొన్ని సార్లు ఏకంగా జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయంభ్రాంతులకు గురి చేస్తుంటాయి.
కాని సాధు జంతువులైతే ధైర్యం చేసి దానిని పట్టుకునే ధైర్యం చేయవచ్చు.ఇలా అమెరికాలోని వాల్ మార్ట్ షాపింగ్ మాల్ లోకి ఓ జింక ప్రవేశించి హల్ చల్ చేసింది.
వెంటనే వాల్ మార్ట్ ఉద్యోగి జింకను చాక చక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నించింది.వెంటనే ఇతర సిబ్బంది సైతం రావడంతో జింకను ఎటూ కదలనీయకుండా రెజ్లర్ తరహాలో పట్టుకుని జాగ్రత్తగా వాల్ మార్ట్ వెనుక నుండి పంపించి వేశారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.