వైరల్ వీడియో: చీర కట్టుకొని ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తో ఫీట్స్ చేస్తూ అదరగొట్టిన మహిళ..!

సమాజంలో ప్రతి రంగంలో మహిళలు దూసుకెళ్తున్నారు.మగవాళ్లకు పోటీగా ప్రతి విషయంలోనూ తాము తక్కువ కాదంటూ ముందడుగు వేస్తున్నారు.

 Viral Video A Woman Feats With Lpg Gas Cylinder In Saree-TeluguStop.com

ఓ మహిళ ఎర్ర చీర ధరించి మగవారితో పోటీగా ఫీట్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఎల్పీజీ సిలిండర్‌తో విన్యాసాలు చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మహిళ సిలిండర్‌ను ఎత్తి వ్యాయామం చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది చక్కర్లు కొడుతోంది.ఈ మహిళ పేరు షెల్లీ చికారా.

 Viral Video A Woman Feats With Lpg Gas Cylinder In Saree-వైరల్ వీడియో: చీర కట్టుకొని ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తో ఫీట్స్ చేస్తూ అదరగొట్టిన మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమె తన దంతాలతో కూడా సిలిండర్‌ను ఎత్తి ఔరా అనిపించింది.ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.వారందరు తమ కామెంట్స్‌తో షెల్లీని అభినందిస్తున్నారు.

అంతేకాకుండా ఆమె వీడియోలను షేర్ చేస్తు వైరల్‌ చేస్తున్నారు.ఒక వీడియోలో ఎర్ర చీర ధరించి రెండు చేతులతో గ్యాస్ సిలిండర్ ఎత్తడం కనిపిస్తుంది.

ఈ సిలిండర్ నిండినదా ఖాళీదా అని మాత్రం చెప్పలేం.ఏదేమైనా ఈమె చేసిన సాహసానికి మాత్రం గుర్తింపు వస్తోంది.

వీడియో నేపథ్యంలో హర్యన్వి పాట ప్లే అవుతోంది.

మహిళ చేసి ఫీట్స్ మాత్రం చాలా ఫన్నీగా ఉండడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

చాలా వీడియోలలో ఈ మహిళ ఎల్పిజి సిలిండర్లతో విభిన్న వ్యాయామాలు చేయడం కనిపిస్తుంది.మరో వీడియోలో ఈ అమ్మాయి పళ్ళతో సిలిండర్ను ఎత్తేస్తుంది.

ఈ వీడియో చూసిన వారందరు ఆశ్చర్యపోయారు.అదే సమయంలో ఇంకో వీడియోలో ఈ అమ్మాయి సిలిండర్‌ను పొట్టపై ఉంచి వ్యాయామం చేస్తోంది.ఆశ్చర్యకరంగా పొట్టపై ఉన్న సిలిండర్‌పై ఓ పిల్లవాడిని కూర్చోబెట్టుకుని వ్యాయామం చేస్తుంది.ఈ వీడయో చూసిన నెటిజన్లు ఆమెను అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

మహిళలు తలుచుకుంటే ఏదైనా చేస్తారని నిరూపిస్తున్నావని తెగ పొగిడేస్తున్నారు.షెల్లీ చికారా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తనను తాను సర్టిఫైడ్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్‌గా అభివర్ణించింది.

ఆమె ఐటి రంగంలో పనిచేస్తుందని కూడా సమాచారం.

#A Woman #Gas Cylinder #WomenStunts #Social Media #Stuns

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు