వైరల్ వీడియో: బోరు పంపు కొడుతూ దాహం తీర్చుకున్న ఏనుగు

మానవుడు భూమి మీద తానే గొప్ప వాడినని అనుకుంటాడు.కాని అది నిజం కాదని చాలా సమయాల్లో మనకు రుజువయింది.

 Viral Video A Thirsty Elephant Pumping A Bore For Drinking Water-TeluguStop.com

ఎందుకంటే జంతువులు మూగ జీవాలు అని చాలా తేలికగా తీసిపారేస్తాం.కాని వాటికి ఉండే అపారమైన టాలెంట్ మనుషులలో కూడా ఉండదు.

సహజంగా ఏ పని చేయాలో అది మనం ఇంకొకరిని అడిగో, లేకపోతే ఎవరైనా చేస్తుంటే చూసి నేర్చుకునే శక్తి మనకు ఉంటుంది.కాని అలా నేర్చుకోవడం జంతువులకు సాధ్యపడదు.

 Viral Video A Thirsty Elephant Pumping A Bore For Drinking Water-వైరల్ వీడియో: బోరు పంపు కొడుతూ దాహం తీర్చుకున్న ఏనుగు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే మన ఆలోచనా సామర్థ్యం, జంతువుల ఆలోచనా సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది.వాటికి అసలు అలా చేయగలిగే సత్తా లేదని మనం ఖరాఖండీగా చెబుతాం.

కాని ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం.అవును మనలాగే జంతువులు కూడా చేయగలవు.

ఏంటి నమ్మడం లేదా.సహజంగా మనకు దాహం వేస్తే బోరుపంపును కొట్టి దాహం తీర్చుకుంటాం.

కాని జంతువులైతే ఎవరో ఒకరు బోరుపంపును కొడితే అవి దాహం తీర్చుకుంటాయి.కాని మీరిప్పుడు చూడబోయే వీడియోను చూసి మీ అభిప్రాయం మార్చుకుంటారు.

ఒకవిధంగా చెప్పాలంటే ఆశ్చర్య పోతారు కూడా.ఓ ఏనుగు దాహం వేసిందని చెప్పి తనకుతానుగా బోరు పంపును కొట్టి దాహం తీర్చుకుంటోంది.

అలా తనకు దాహం తీరాక అక్కడి నుండి వెళ్లి పోయింది.అయితే ఈ వ్యవహారాన్ని గమనించిన అక్కడ కూర్చున్న వ్యక్తులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు.

ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

#Netizens #ElephantViral #ViralVideo #Viral Elephant #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు