వైరల్ వీడియో: ఆ చిన్ని ఏనుగు తన దాహం తీర్చుకోవడానికి నేరుగా..?!

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం మనం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video A Thirsty Baby Elephant Use Bore Pump In Jaldapara National Park,  B-TeluguStop.com

ఇలా వైరల్ అవుతున్న వీడియోలు కొంతమంది నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ అంటే మరి కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.కొన్ని వీడియోలు మాత్రం చాలా అందంగా ఉండటంతో పాటు మళ్ళీ మళ్ళీ వాటిని వీక్షించాలనే భావన అందరిలోనూ కలుగుతుంది.

అచ్చం అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఆ వీడియో ఆధారంగా ఒక గున్న ఏనుగు దాహం తీర్చుకునేందుకు స్వయంగా తానే హ్యాండ్ పంప్ చేసుకుంటూ నీరుని తాగుతుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కామెంట్ల వర్షం కురుస్తుంది.

ఈ వీడియోని వీక్షించినవారు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో అని సర్చ్ చేయగా చివరకు పశ్చిమ బెంగాల్ లోని ఆలీపూర్ జిల్లాలో జల్దాపర నేషనల్ పార్కు లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ గున్న ఏనుగు వయసు కేవలం 9 నెలలు మాత్రమే.చిన్న ఏనుగు పార్కులో సరదాగా తిరుగుతున్న సమయంలో ఆ ఏనుగుకి దాహంగా అనిపించడంతో అక్కడే ఉన్న చేతి పంపు ఉపయోగించి స్వయంగా హ్యాండ్ పంప్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా నీరును తాగేసింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube