వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే సైకిల్ పై వచ్చి చోరీ చేసిన దొంగ..!

నేటి రోజులలో దొంగతనాలు ఎక్కువైపోయాయి.చాలా మంది డబ్బులను ఈజీగా పొందడం కోసం దొంగతనాలకు, దోపిడీలకు అలవాటు పడుతున్నారు.దీనివల్ల సామాన్యులకు చిల్లులు పడుతున్నాయి.సాధారణంగా రాత్రి పూట దొంగతనాలు జరుగుతాయి.అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా పట్టపగలే దొంగతనం చేశాడు.దోపిడీ, చోరీ చేసే ముందు ఎవరికంటా పడకూడదని దొంగలు అనుకుంటారు.

 Viral Video A Thief Came On Cycle And Theft Infront Of Public In Super Market In San Fransisco-TeluguStop.com

అయితే ఇక్కడ మాత్రం ఆ వ్యక్తి దర్జాగా దొంగతనం చేశాడు.సీసీ కెమెరాలకు కూడా భయపడలేదు.

దొంగ సైకిల్ పై దొంగతనం చేశాడు.సూపర్ మార్కెట్ కు సైకిల్ పై వచ్చాడు.

 Viral Video A Thief Came On Cycle And Theft Infront Of Public In Super Market In San Fransisco-వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే సైకిల్ పై వచ్చి చోరీ చేసిన దొంగ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందరి ముందూ దొంగతనం చేసి అందరూ చూస్తుండగా దొంగతనం చేసి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అమెరికా దేశంలోని కాలిఫోర్నియా లో ఉన్న శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ సూపర్ మార్కెట్ ఉంది.వాల్‌ గ్రీన్స్‌ లో ఉన్న ఆ సూపర్ మార్కెట్ లో ఓ వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

ఆ వ్యక్తి వస్తూ వస్తూనే తనతో పాటుగా ఓ నల్లని సంచిని తెచ్చుకున్నాడు.నల్లగా ఉన్న ఆ సంచిలో తనకు కావాల్సిన వస్తువులను వేసుకున్నాడు.ఇలా దొంగ తనకు కావాల్సిన వస్తువులను తీసుకుంటుంటే అక్కడే ఉన్న సెక్యూరిటీ దానిని చూస్తూ ఉండిపోయాడు.

ఆ తర్వాత ఆ దొంగ తనకు కావాల్సిన వస్తువుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లడానికి చూస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ దొంగను ఆపే ప్రయత్నం చేశాడు.చివరికి ఆ దొంగ సెక్యూరిటీని దాటుకని వెళ్లిపోయాడు.సూపర్ మార్కెట్ ఉన్నవారు ఆ దొంగను చూసి పట్టుకోవడానికి ప్రయత్నించలేదు.

అయితే ఆ వ్యక్తి దొంగతనం చేయడం చూసి తమ స్మార్ట్ ఫోన్లలో వీడియో తీసుకున్నారు.ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టారు.

ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

#San Fransisco #Super Market #California #TheftInfront #Cycle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు