వైరల్ వీడియో: దేశీ వాషింగ్ మిషన్ ను రెడీ చేసిన స్కూల్ విద్యార్థి...!

సాధారణంగా బట్టలు చేతితో ఉతికే వారు అయితే రాను రాను బట్టలు ఉతికేందుకు మిషన్లు రావడం తో బట్టలు ఉతికే పని చాలా సులువు గా మారింది దానికి తోడు సమయం కూడా ఆదా అవుతుంది.బట్టలు ఉతికే మిషన్లు ఎన్నో సంస్థలు ఎన్నో బ్రాండ్లు వచ్చినప్పటికీ మధ్యతరగతి కుటుంబానికి సామాన్యులకు ఇప్పటికీ వాషింగ్ మిషన్ ఖరీదు అందని ద్రాక్ష పండులా మారింది దీంతో వారు ఎంత పని ఉన్నా బట్టలు ఉతకడానికి చేతులను వినియోగించాల్సి ఉంది అయితే ఇలాంటి వారి కోసం ఓ విద్యార్థి తాను స్వయంగా ఒక వాషింగ్ మెషిన్ తయారు చేశాడు.

 Viral Video A School  Student Designed Desi Washing Machine, Viral Latest, Viral-TeluguStop.com

జుగాద్ టైం- కాన్సెప్ట్ ఉపయోగించి రూపొందించాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన స్కూల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆ స్కూల్ విద్యార్థి ఒక వాషింగ్ మిషన్ ను తయారు చేశాడు.ఈ వాషింగ్ మెషిన్ ప్రత్యేకత ఏంటంటే .సైకిల్ పెడల్ ను ఉపయోగించి తయారుచేసిన ఈ వాషింగ్ మెషిన్ వెనుక భాగంలో పెద్ద మెషినరీ సిస్టంను ఇన్స్టాల్ చేశాడు.ఈ వాషింగ్ మిషన్ బట్టలను చక్కగా ఉతుకుతుంది.

ఆ విద్యార్థి ఒక వీడియో ద్వారా వాషింగ్ మిషన్ ఎలా పని చేస్తుందో బట్టలను వేసి ఉతికి మరి చూపించాడు.ఆ సమయంలో విద్యార్థి దగ్గరకు ఇతర పాఠశాల విద్యార్థులు కూడా చుట్టుముట్టారు.

మొదట వాషింగ్ మెషిన్ లో డిటర్జెంట్ పౌడర్ వేసిన ఆ విద్యార్థి, తర్వాత ఒక మురికి ఉన్న క్లాత్ ను వేసి సైకిల్ తొక్కడం ప్రారంభించాడు.కొన్ని నిమిషాల తర్వాత వస్త్రాన్ని బయటికి తీసి చూస్తే అది చాలా శుభ్రంగా ఉంది.ఈ వీడియోను స్టోరీ ఫర్ మీమ్స్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా దేశి వాషింగ్ మిషన్ అనే క్యాప్షన్తో షేర్ చేశారు.విద్యార్థి తయారుచేసిన వాషింగ్ మిషన్ వీడియో వైరల్ గా మారడంతో ప్రస్తుతం విద్యార్థి సృజనాత్మకత పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube