వైరల్ వీడియో: చూడకుండానే సెకన్స్ లో రూబిక్ క్యూబ్ ను సాల్వ్ చేసిన బుడ్డోడు..!

మనమందరం రూబిక్ క్యూబ్ చూసే ఉంటాం.అప్పుడప్పుడు ట్రై చేసి కూడా ఉంటాము.

 Viral Video A Rubic Qube Share By Sachin Tendulkar-TeluguStop.com

అయితే మనలో చాలామంది ర్యుబిక్ క్యూబ్ సాల్వ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటే.మరికొందరు మధ్యలోనే దానిని వదిలి పెట్టడం గమనిస్తూనే ఉంటాం.

ఈ మధ్యకాలంలో మార్కెట్లో వివిధ రకాల రూబిక్ క్యూబ్ మార్కెట్లోకి అందుబాటులోకి రావడం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే ఈ రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయడం అంటే అంత సులువైన విషయం కాదు మనకు.

 Viral Video A Rubic Qube Share By Sachin Tendulkar-వైరల్ వీడియో: చూడకుండానే సెకన్స్ లో రూబిక్ క్యూబ్ ను సాల్వ్ చేసిన బుడ్డోడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మరికొందరైతే ఈ రీమేక్ క్యూబ్ ను ఒక్కసారి చూసి ఆ తర్వాత కళ్ళతో వాటిని చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకొని మరి దానిని కేవలం కొన్ని సెకన్లలోనే చేస్తున్నారు.

ఇదే కోవలోకి తాజాగా ఓ బాలుడు రూబిక్ క్యూబ్ ను సాల్వ్ చేసిన విధానాన్ని భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తాజాగా ఓ వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.

ఈ వీడియోలో ఓ బాలుడు మొదటిగా సచిన్ టెండూల్కర్ ఇచ్చిన రూబిక్ క్యూబ్ ను పరిశీలించి ఆ తర్వాత తన తలపై రూబిక్ క్యూబ్ ను కేవలం 17 సెకండ్స్ లోనే సాల్వ్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.ఇంతకీ ఆ బాలుడు ఎవరో చెప్పలేదుగా.

ముంబై నగరానికి చెందిన అయిమన్ కొలి.ఇతడు రూబిక్ క్యూబ్ లను సాల్వ్ చేయడంలో మహా దిట్ట.అతడికి ఈ రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయడం లో గిన్నిస్ రికార్డ్ కూడా లభించింది.ఇదే క్రమంలోనే తాజాగా అతను సచిన్ టెండూల్కర్ ను కలవడం జరిగింది.

ఆ సమయంలోనే సచిన్ టెండూల్కర్ అతడికి ఒక రూబిక్ ఇవ్వక దానిని అతి తక్కువ సమయంలోనే పరిశీలించి దానిని చూడకుండా తన తలపై ఉంచి కేవలం 17 సెకన్లలోనే సాల్వ్ చేయడంతో సచిన్ అతడు చేసిన పనికి ఫిదా అయిపోయాడు.ఈ వీడియోని సచిన్ టెండూల్కర్ తన ఖాతా ద్వారా షేర్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోకి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోలో ఆ అబ్బాయి సాల్వ్ చేసిన తర్వాత అతడి తర్వాత చాలెంజ్ తనకి రూబిక్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయడం నేర్పించడం అని ఫన్నీగా మాట్లాడాడు.

#Viral #Social Meida #Cube Solving #Viral Video #Sachin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు