వైరల్ వీడియో: జనావాసాల్లోకి అరుదైన భారీ మొసలి..!

మొసలి అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.మనం బిర్యానీని ఎలా నమలి నమలి తింటామా ఒకవేళ మొసలికి మనం దొరికిన అది మనల్ని అలాగే నమిలి నమిలి తినేస్తుంది.

 Viral Video A Rare Giant Crocodile Inhabited Crocadile , Social Media, Twitter,-TeluguStop.com

ఇలాంటి దృశ్యాలను మనం సోషల్ మీడియాలో అలాగే టీవీలలో చూస్తుంటేనే భయబ్రాంతులకు లోనవుతాం.అలాంటి మొసలి ఏకంగా నడుచుకుంటూ వచ్చి జనాలు నివసిస్తున్న ప్రాంతానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి మరి.అవును అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొన్ని మొసల్లు జనావాసాల్లోకి రావడం ఎక్కువైంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఇంటి ఆవాసాలకు దగ్గరలో ఉన్న నదులు, సరస్సులు నుండి మొసళ్ళు అప్పుడప్పుడు జనావాసాల్లోకి అలాగే గోల్ఫ్ కోర్సులోకి రావడం మనం గమనిస్తూనే ఉన్నాము.ఇకపోతే తాజాగా ఫ్లోరిడా రాష్ట్రంలోని నేపుల్స్ లో ఉన్న వాల్ సేమియా గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ లో ఓ అరుదైన ముసలి కనబడింది.

అది చూడటానికి చాలా వింతగా కూడా ఉంది.ఆ వింత మొసలిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్ కెమెరాలో చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది.

ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలను నేపుల్స్ డైలీ న్యూస్ కూడా ప్రచురితం చేసింది.అయితే ఈ వీడియో షేర్ కాకముందే ఆ ముసలి కి సంబంధించిన ఫోటోలను మరో వ్యక్తి సోషల్ మీడియాలో ట్వీట్ చేయగా ఆ ఫోటోలు నకిలీవని చాలా మంది భావించారు.

అయితే ఆ తర్వాత ఈ వీడియో కు సంబంధించి కూడా ఎంతోమంది ఇది నిజం కాదని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.దీనికి కారణం ఆ వీడియోలో ఉన్న మొసలి కాళ్ళు చాలా పొడవుగా ఉండడమే నెటిజెన్స్ కు ఇది అసలైన మొసలి కాదని అభిప్రాయపడుతున్నారు.

చాలా మంది నెటిజన్స్ దీన్ని ఫేక్ వీడియో గా అభివర్ణిస్తున్నారు.అయితే ఈ వీడియో కి సంబంధించి తాజాగా ఓ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ స్పందిస్తూ చాలా మంది ప్రజలు ఎప్పుడు చూసి ఉండరు కాబట్టి వారు ఈ వీడియోను కచ్చితంగా ఫేక్ అని భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఇటువంటి మొసల్లు కనిపించడం సర్వసాధారణం, ఇదేమి వింత పెద్ద కాదని వారు తెలిపారు.మామూలుగా యుక్తవయసులో ఉన్న మొసళ్ళు ఏదైనా 9 నుంచి పది అడుగుల ఎత్తు కూడా ఉంటాయని వారు తెలుపుతున్నారు.

అందులో వాటి కాళ్ళ పొడవు ఒకటి నుంచి రెండు అడుగుల వరకు కూడా ఉంటాయని జువాలాజికల్ వారు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube