వైరల్ వీడియో: కనురెప్ప పాటు సమయంలో మొసలికి అహారమైన పావురం..!

దేవుడి సృష్టి భలే విచిత్రంగా ఉంటుంది కదా.ఒక జీవి ప్రాణం తీసే హక్కు మరో జీవికి లేదని అంటూ ఉంటారు.

 Viral Video A Pigeon Has Become Food For A Crocodile In Fraction Of Seconds , Cr-TeluguStop.com

కానీ దేవుడి సృష్టి భలే అద్భుతంగా ఉంటుంది.ఎందుకంటే ఒక జీవి బతకాలంటే మరొక జీవిని చంపాలిసిందే.

లేదంటే ఆ జీవి బతకడం చాలా కష్టం.నిజమే కదండీ.

పులి బతకాలంటే జింకను తినాలి.పిల్లి బతకాలంటే ఎలుకను చంపి తినాలి.

అలాగే మనిషి కూడా అంతే కోడిని, మేకను చంపి తినాలిసిందే.అలాగే ఒక ముసలి తన ఆకలి తీర్చుకోవడానికి ఒక పావురాన్ని చంపేసింది.

అవునండి మీరు విన్నది నిజమే.నీళ్లలో ఉన్న మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది అని అంటుంటారు కదా.

ఏ జంతువు అయినా ముసలికి చిక్కిందంటే చాలు అది చనిపోవడం ఖాయం.నీళ్లలో నక్కి నక్కి సైలెంట్ గా ఉంటుంది.

అదును చూసుకుని ఒక్కాసారిగా నీళ్ళల్లోకి వచ్చిన జంతువులపై విరుచుకు పడుతుంది.ఇప్పుడు ముసలి కంట చిక్కిన ఒక పావురాన్ని కూడా అలాగే అమాంతం నోట్లో వేసేసుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.

ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలను తెగ వైరల్ చేస్తూ ఉంటారు నెటిజన్లు.

అలాగే అడవిలో జంతువులు, ఇంట్లో పెంపుడు జంతువులు చేసే విన్యాసాలను వీడియో తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఆ వీడియోలు కాస్త నెట్టింట్లో వైరల్ అయ్యి అనేక లైక్స్, కామెంట్స్ వస్తాయి.ఒకసారి ఈ వీడియోను పరిశీలిస్తే ఒక సరస్సు ఒడ్డున ఒక అమాయకపు పావురం నీళ్లు తాగుతూ సేద తీరుతూ ఉంటుంది.ఆ పావురాన్ని గమనించిన ముసలి సైలెంట్ గా ఒక్క క్షణం ఆ పావురాన్ని గమనించి దాని దగ్గరకు చేరుకొని గట్టిగా నోటితో పట్టుకుని అమాంతం మింగేస్తుంది.

పాపం ఎక్కడి నుండి వచ్చిందో ఏమో అమాయకపు పావురం మొసలి కి ఆహారంగా మారిపోయింది.ఈ షాకింగ్ వీడియోకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

దీనిని చూసిన నెటిజన్లు పాపం.! పావురం అని దాని మీద జాలి పడుతూ పోస్ట్లు పెడుతున్నారు.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయ్యో అనకుండా ఉండరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube