వైర‌ల్ వీడియో.. పిల్ల‌ల‌తో క్రికెట్ ఆడుతున్న లెజెండ్‌

మ‌న దేశంలో ఆట‌లు అనే విష‌యానికి వ‌స్తే ముందుగా గుర్తుకు వ‌చ్చేది మాత్రం క్రికెట్ అనే చెప్పాలి.ఎందుకంటే ఏ ఆట‌ల‌కు ద‌క్క‌నంత క్రేజ్ మ‌న దేశంలో కేవ‌లం క్రికెట్ కు మాత్ర‌మే ద‌క్కింది.

 Viral Video Legend Playing Cricket With Children-TeluguStop.com

దీంతో మొద‌టి నుంచి అన్ని క్రీడలు క్రికెట్ నీడ‌లోనే ఉంటున్నాయి.ఇక క్రికెట్ గాడ్‌గా మ‌న దేశంలో స‌చిన్‌కు ఓ రేంజ్ ఉంది.

ఆయ‌న క్రికెట్ లో సాధించిన రికార్డు, అవార్డులు అన్నీ ఇన్ని కావు.ఆయ‌న సాధించిన ఘ‌న‌త దేశానికి ఓ గొప్ప స్ఫూర్తిని తీసుకువ‌చ్చింది.

 Viral Video Legend Playing Cricket With Children-వైర‌ల్ వీడియో.. పిల్ల‌ల‌తో క్రికెట్ ఆడుతున్న లెజెండ్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రిటైర్మెంట్ త‌ర్వాత కూడా ఆయ‌న క్రికెట్ కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

ఇక మామూలుగానే స‌చిన్ వీడియోలు సోష‌ల్ మీడియాలో ఈజీగానే వైర‌ల్ అవుతుంటాయి.

ఎందుకంటే సోస‌ల్ మీడియాలో స‌చిన్‌కు అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్నారు.ఇక ఆయ‌న ప్ర‌తి సంద‌ర్భంలో కూడా ఏదో ఒక స్ఫూర్తి దాయ‌క‌మైన వీడియోల‌ను పోస్టు చేస్తూనే ఉంటారు.

ఇక ఇప్పుడు కూడా ఆయ‌నో ఇంట్రెస్టింగ్ వీడియోల‌ను త‌న సోస‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.దీంతో ప్ర‌స్తుతం అది విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ఎందుకంటే ఈ వీడియోలో కూడా స‌చిన్ క్రికెట్ ఆడుతున్నారు.కాక‌పొతే ఆయ‌న ఆడుతుంది మాత్రం క్రికెట్ గ్రౌండ్ లో కాదు.

ఇక జాతీయ క్రీడా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని స‌చిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా దేశ యువ‌త‌కు గొప్ప సందేశం ఇచ్చాడు.మ‌న దేశంలో ఉన్న యువ‌త ఎక్కువ‌గా ఆట‌ల‌ను ఓ అల‌వాటుగా మార్చుకుంటే జీవితంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని ఆయ‌న చెప్పారు.ఈ ఆట‌లే మ‌న‌కు క‌ఠిన ప‌రిస్థితుల్లో కూడా ఎంతో వినోదాన్ని పంచుతాయంటూ వివ‌రించారు.అయితే ఆయ‌న షేర్ చేసిన వీడియోలో ఆయ‌న కొంద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడుతున్న‌ట్టు ఉంది.

ఇందులో ఆయ‌న ఇంట్లోనే పిల్ల‌ల‌తో స‌ర‌దాగా క్రికెట్ ఆడుతున్నారు.

.

#SachinPlay #Sachin #Viral #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు