వైరల్ వీడియో: ఫ్లైట్ టేకాఫ్ సమయంలో వెకిలి చేష్టలు చేసిన వ్యక్తి..!

కొంతమంది అప్పుడప్పుడు వారికి తెలియకుండానే ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.అలాంటి వాళ్ళను మనం అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం.

 Airlince, Social Media, Viral Video, Flight, Stranger, Mccarran, Alaska Airlines-TeluguStop.com

పిచ్చి వారైనా లేకపోతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.అయితే తాజాగా ఓ వ్యక్తి ఓ విమానంపై తెగ హల్ చల్ చేశాడు.

ఆ విమానం ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న విమానానికి ఎయిర్లైన్స్ అధికారులు అప్పటికే అన్ని క్లియరెన్స్ లు ఇచ్చేశారు కూడా.కేవలం కొద్ది నిమిషాల్లో ఆ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కాలేదు.

ఎగిరి వెళ్లాల్సిన విమానం రెక్క పైకి అతడు ఎక్కేసాడు.

విమానం రెక్క పైకి ఎక్కి పిచ్చిపిచ్చి విన్యాసాలు చేశాడు.

ఈ సంఘటన మొత్తం అమెరికా దేశంలోని లాస్ వెగాస్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం లో జరిగింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.మెక్‌కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాస్ వేగాస్ నుండి పోర్ట్ ల్యాండ్ వెళ్తున్న అలస్కా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేక్ ఆఫ్ రెడీ అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

విమానానికి అన్ని అనుమతులు లభించాక ఎయిర్లైన్స్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు కూడా.విమానం కొద్ది నిమిషాలలో టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ వ్యక్తి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి విమానాశ్రయం ఫెన్సింగ్ దాటుకొని నేరుగా ఆ విమానం పైకి ఎక్కేసాడు.ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ విమానం రెక్క పై నిల్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెగ నానా హంగామా చేశాడు.

అయితే ఈ విషయాన్ని గమనించిన విమానం పైలెట్ భద్రతా సిబ్బందికి విషయాన్ని చేరవేయగా దానితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.అతడిని అదుపులోకి తీసుకునేందుకు భద్రతా సిబ్బంది అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube