వైర‌ల్ వీడియో.. అన‌కొండ‌ల మ‌ధ్య‌లో ఇరుక్కున్న వ్య‌క్తి..

సాధారణంగా పాములు, ఇతర జంతువులను చూస్తే చాలు భయపడేవారు చాలా మంది ఉంటారు.అలాంటి వారిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు.

 Viral Video A Man Stuck In The Middle Of The Pythons-TeluguStop.com

అయితే, జంతువులు, వన్యప్రాణులను పూజించే సంస్కృతి మన దేశంలో ఉంటుంది.కానీ, వేరే దేశంలో అయితే ఇటువంటి కల్చర్ ఉండబోదు.

కాగా, నార్మల్‌గా బొమ్మలతో గేమ్స్ ఆడుకున్న మాదిరిగా ఓ వ్యక్తి అనకొండలతో ఆడుకుంటున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.

 Viral Video A Man Stuck In The Middle Of The Pythons-వైర‌ల్ వీడియో.. అన‌కొండ‌ల మ‌ధ్య‌లో ఇరుక్కున్న వ్య‌క్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సదరు వైరల్ వీడియోలో ఆ వ్యక్తి అనకొండల మధ్య ప్రశాంతంగా కూర్చోవడాన్ని మీరు చూడొచ్చు.

అనకొండల మధ్య కూర్చొని మాట్లాడుతూ సంతోషంగా కనిపిస్తున్నాడు సదరు వ్యక్తి.

ఈ క్రమంలోనే అతడిపైకి సడెన్‌గా అనకొండలు వస్తాయి.అయినా అతడు భయపడకుండా ఉంటాడు.

అతడే మిస్టర్ బ్రూవర్. అతడికి కాలిఫోర్నియాలోని సరీసృపాల జూ ఉంది.

జూ కీపర్‌గా ఉన్న అతడికి అనకొండలను పట్టడంలో అపారమైన అనుభవం ఉంది.బ్రూవర్ భయంకరమైన స్నేక్స్‌ను చాలా ఈజీగా పట్టేయగలడు.

ఇందుకు సంబంధించిన చాలా వీడియోస్ గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా ఒళ్లు గగుర్పొడిచే వీడియో ట్రెండ్ అవుతోంది.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ అయిన ఈ వీడియో తెగ వైరలవుతోంది.అయితే, ఈ వీడియో చూస్తే మీరు ఎంతటి ధైర్యవంతులైనా తప్పకుండా భయపడుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంతటి అనుభవమున్నా ఒక్క క్షణం ఆదమరిస్తే అంతే సంగతులను హెచ్చరిస్తున్నారు.అన్ని వేళలా జాగ్రత్త వహించాల్సిందే అని పోస్టులు పెడుతున్నారు.గతంలో బ్రూవర్ ఓ అనకొండ వద్దకు వెళ్లి దానిని చూపించే ప్రయత్నం చేస్తుండగానే అది తనపైకి వచ్చింది.అయితే, అప్పుడు అనకొండ తన పిల్లపై దాడి చేస్తున్నట్లు భావించి తనపైకి వచ్చిందని బ్రూవర్ ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో వివరణ కూడా ఇచ్చాడు.

#Broover Middle #Calinia #Broover #Zoo Keeper #Anacondas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు