వైరల్ వీడియో: కరెంట్ పోల్ ఎక్కి హల్చల్ చేసిన భారీ పాము.. చివరికి..?!

వర్షాకాలం వస్తే చాలు చాలా చోట్ల కరెంటు ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడం, కరెంటు సప్లై అయ్యి మరణించడం వంటివి జరుగుతుంటాయి.

 Viral Video A Huge Snake That Climbed The Current Pole And Made A Commotion Fina-TeluguStop.com

విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ్స్‌లో ఎక్కువ లోడ్‌లో కరెంట్ ఉంటుంది.ఈ విషయం చాలా మంది తెలుసు.

అందుకే విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లల దగ్గర డేంజర్ బోర్డులు పెట్టడంతో పాటు దాని చుట్టూ కంచెను వేస్తారు.మనుషులు అయితే ఈ హెచ్చరికలు చదవి భయంతో పక్కకు వెళ్లిపోతాయి.

అయితే మూగజీవాలకు అవేంటో తెలియక హైవోల్టేజ్ కరెంట్ కారణంగా చాలాసార్లు ప్రాణాలు కోల్పోతాయి.అలాంటి హృదయవిదారక సంఘటన ఒకటి తాజాగా ఇండోర్‌లో చోటు చేసుకుంది.

స్థానిక సింధీ కాలనీ ప్రాంతానికి చెందిన జాగృతి నగర్ కూడలిలోని విద్యుత్ స్థంభంపైకి 10 అడుగుల పొడవైన పాము పాకుతూ ఎక్కేసింది.ఇక ఆ పాము గుర్రపు జాతికి చెందినది తెలుస్తోంది.

అది దిగే ప్రయత్నంలో దానికి అకస్మాత్తుగా బలమైన హైవోల్టేజ్ షాక్ తగిలింది.అంతే ఒక్కసారిగా ఆ భారీ విషసర్పం 25 అడుగుల ఎత్తైన స్తంభం నుండి నేరుగా నేలమీద పడింది.

దిగే ప్రయత్నంలో ఆ పాము పోల్‌పై అమర్చిన ఓపెన్ వైర్ నుంచి తప్పించుకుంది గానీ అనూహ్యంగా అక్కడ ఉన్న ఇనుప తీగకు తగలడంతో పెద్దగా పేలిన శబ్దం వచ్చింది.నేలమీద నీరు, గడ్డి ఉండటంతో ఆ పాము చనిపోకపోయినా, తీవ్రంగా గాయపడింది.

దాన్ని గమనించిన స్థానిక ప్రజలు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు.

ఆ స్నేక్ క్యాచర్ గాయపడిన పామును ఒక సంచిలో తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ప్రస్తుతం మూగజీవాలు ఇలా ప్రాణాలు వదిలే స్థితికి మనుషులు కొన్ని చర్యలు చేపడుతున్నారు.

దీనివల్ల మూగజీవాలు అంతరిస్తున్నాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube