వైరల్ వీడియో: ఆ రెండు జంతువుల మధ్య భీకర పోరు..!

నల్ల చిరుతపులి లేదా బ్లాక్ పాంథర్ ని ధైర్యానికి మారుపేరు అని చెప్పుకోవచ్చు.శత్రువుకి తలోగ్గి వెనకడుగు వేసే లక్షణాలు ఈ చిరుతపులి లో ఏ మూలన కూడా కనిపించవు.

 Viral Video A Fierce Fight Between The Two Animals, Viral Video, Viral Post, Vir-TeluguStop.com

ఎంత పెద్ద శత్రువు అయినా.సరే, దాడి చేసి చంపడానికే ఈ చిరుతపులులు సిద్ధంగా ఉంటాయి.

దక్షిణ అమెరికాలో పెరిగే గ్రీన్ అనకొండ పాములు కూడా చాలా శక్తివంతమైనవి.నీటిలో వాటిని మించిన శక్తివంతమైన జీవరాశులు మరేమీ లేవు అని చెబుతుంటారు.

అయితే దక్షిణ అమెరికా లో పెరిగిన ఓ నల్ల చిరుతపులి ఒక గ్రీన్ అనకొండ పై దాడి చేసింది.ఈ భీకరమైన ఫైట్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఆ అనకొండ పాము 130 కిలోల కి పైగానే బరువు ఉన్నట్టు తెలుస్తోంది.కానీ 100 కిలోల బరువు ఉన్న బ్లాక్ పాంథర్ మాత్రం ఈ పాము తోక పట్టుకొని బలంగా లాగేస్తూ చంపేయడానికి ప్రయత్నించింది.

దీంతో గ్రీన్ అనకొండ సమీపంలో ఉన్న కాల్వలోకి దూకి తన ప్రాణాలను కాపాడుకుంటూ చిరుత ప్రాణాలను తీసేయాలని శతవిధాల ప్రయత్నించింది.ఈ సమయంలోనే చిరుత నోటిని ఆ పాము చుట్టేస్తూ ఊపిరాడకుండా చేసి చంపేయాలని చూసింది.

అయితే ఈ నల్ల చిరుతపులి మూతి ని పాము చుట్టేయడం తో అక్కడే ఉన్న మరొక చిరుత వెంటనే తన ఫ్రెండ్ ని కాపాడటానికి ముందుకు వచ్చింది.కానీ ఈలోగా నల్ల చిరుతపులి తన మూతికి చుట్టుకుపోయిన పాము ఉచ్చు నుంచి విడిపించుకుంది.

తర్వాత ఆ పాముని మళ్ళీ భూమి మీదకి లాక్కొచ్చింది.అప్పటికే చిరుతపులి దాడిని ఎదుర్కోలేక బాగా సాగిలపడి పోయిన అనకొండ భూమ్మీదకి రాగానే మరింత క్షీణించింది.

కానీ తన తలను చిరుతపులి నుంచి కాపాడుకుంటూ చాలాసేపు పోరాటం చేసింది.అయితే చిరుతపులి శక్తి ముందు అనకొండ తట్టుకోలేక చివరికి ప్రాణాలు విడిచింది.

ఆ నల్లచిరుత పాముని బాగా కొరికేసి ముక్కలు ముక్కలుగా చేసి పడేసింది.చంపేసిన తర్వాత ఆ పామును నల్లచిరుత ముట్టుకోకపోగా దాని ఫ్రెండ్ అయిన మరొక చిరుతపులి నిర్జీవంగా పడి ఉన్న పాము ముక్కలతో ఆడుకున్నట్టు 2013లో వైరల్ అయిన వీడియో లో కనిపించింది.

అయితే ఆ వీడియో కి సంబంధించిన ఒక క్లిప్ ని ఓ యూజర్ తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.దీంతో ఈ భయంకరమైన వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.

అయితే నల్ల చిరుత యొక్క అద్భుతమైన శక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube