వైరల్ వీడియో: ఒకవైపు వేగంగా వచ్చిన ట్రైన్, మరోవైపు రైల్వే ట్రాక్‌ పై ఇరుక్కున్న బైక్.. చివరకి..?!

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో రకాల వీడియోలను మనం చూస్తూనే ఉండడం.అందులో కొన్ని వీడియోలు తెగ వైరల్ గా మారుతుండటం వాటిలో కొన్ని జంతువులకు, పక్షులకు సంబంధించినవి మాత్రమే కాకుండా కొన్ని భయభ్రాంతులకు గురి చేసేవి కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి.

 Viral Video A Fast Train On One Side And A Bike Stuck On The Railway Track On The Other Finally-TeluguStop.com

తాజాగా ఒళ్ళు గగుర పెట్టే విధంగా ఉండేలా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియోలో ఓ వ్యక్తి తన బైక్ ను రైల్వే ట్రాక్ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అందులో కనబడుతుంది.

ఇందుకు కారణం అతను ట్రాక్ పై బండిని తీసుకుంటూ వెళ్లడమే.అయితే అనుకోకుండా ఆ రైల్వే ట్రాక్ పై బైక్ పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

 Viral Video A Fast Train On One Side And A Bike Stuck On The Railway Track On The Other Finally-వైరల్ వీడియో: ఒకవైపు వేగంగా వచ్చిన ట్రైన్, మరోవైపు రైల్వే ట్రాక్‌ పై ఇరుక్కున్న బైక్.. చివరకి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బైక్ ట్రాక్ పై ఇరుక్కున్న సమయంలో ఓ రైలు వేగంగా రావడం గమనించవచ్చు.రైలు వేగంగా వస్తున్నప్పటికీ అతను ట్రైన్ ఆపడానికి చెయ్యి పైకెత్తి చూడడం మనం గమనించవచ్చు.

చుట్టుపక్కల వారు ఎంతమంది ఆ వ్యక్తికి చెప్పినా వినకుండా మూర్ఖంగా నిర్లక్ష్యంగా ప్రయత్నించాడు.ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ ప్రాంతంలో ఉన్న సంధియ వంతెన వద్ద జరిగింది.

ఇకపోతే అందిన సమాచారం మేరకు రైలు దగ్గరకు వస్తున్న సమయంలో ఆ వ్యక్తి రైల్వే ట్రాక్ పై విన్యాసాలు చేస్తున్నాడని తన వాహనాన్ని ట్రాక్ నుండి బయటకు తరలించడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు.

స్కూటర్ ను ట్రాక్ నుండి బయటికి తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండడం అలాగే అది ట్రాక్ లో ఇరుక్క పోయిందని గ్రహించి రైలు లోకో పైలట్ కు ఆపమని సిగ్నల్ ఇవ్వడానికి చెక్కి పైకెత్తాడు.అయితే వేగంగా వస్తున్న రైల్ కంట్రోల్ కావడం అంత సులువైన విషయం కాదు కద దాంతో ఆ రైలు బైక్ ను ఢీకొని కొద్దిదూరం పాటు ముందుకు లాక్కుని వెళ్ళింది.అయితే చివరి నిమిషంలో అతడు బైకును వదిలి పట్టాల అవతల వైపు వెళ్లడంతో అతని ప్రాణాలు కాపాడుకున్నాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది కాస్త అధికారులకు చేరడంతో ఆ వ్యక్తి ఎవరన్న ఈ విషయంపై అధికారులు గాలిస్తున్నారు.

#Viral Video #Track #Bike #Social Meida

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు