వైర‌ల్ వీడియో.. చిన్నారి కంటే ముందే అమ్మ అని పిలిచేస్తున్న కుక్క‌..

Viral Video A Dog Calling His Mother Before He Was A Child

ఒక‌ప్పుడు కుక్కలు అంటే దూరం పాటించేవారు చాలామంది.కానీ ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయండోయ్‌.

 Viral Video A Dog Calling His Mother Before He Was A Child-TeluguStop.com

ఇప్పుడు ఎవ‌రి ఇంట్లో చూసినా చాలా వ‌ర‌కు పెంపుడు కుక్క‌లు క‌నిపిస్తున్నాయి.ఇంకా చెప్పాలంటే అవి కూడా ఇంట్లో ఒక వ్య‌క్తిలాగా మారిపోయాయి.

మ‌నుషులు ఏదిచేస్తే అవి కూడా అదే ప‌నులు చేస్తున్నాయి.ఇక కుక్క‌ల‌కు సంబంధించిన వీడియోలు ఏవైనా స‌రే చాలా ఫ‌న్నీగా ఉంటాయి.

 Viral Video A Dog Calling His Mother Before He Was A Child-వైర‌ల్ వీడియో.. చిన్నారి కంటే ముందే అమ్మ అని పిలిచేస్తున్న కుక్క‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో అవి చేసే అల్ల‌రి మామూలుగా ఉండ‌దు.అచ్చం త‌మ ఓన‌ర్ల‌ను ఫాలో అయిపోయి వారు ఎలా చేస్తే అవి కూడా అలాగే చేస్తున్న వీడియోలు అనేకం మ‌నం చూస్తున్నాం.

కొన్ని కుక్క‌లు అయితే ఓన‌ర్లు యోగా చేస్తే అవి కూడా అలాగే చేస్తున్నాయి.ఇంకొన్ని అయితే చిన్నారుల‌తో దాగుడు మూత‌లు ఆడుతున్న వీడియోలు కూడా చూస్తున్నాం.ఇలా ఒక్కో త‌ర‌హా ఒక్కో విధంగా మ‌న‌కు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉంటుంది.ఇక‌పోతే ఇప్పుడు కూడా ఓ కుక్క చేసిన ప‌నికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా పాపుల‌ర్ అవుతోంది.

దాన్ని చూసిన వారంతా కూడా కుక్క‌లు ఇలా కూడా చేస్తున్నాయా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ఇంత‌కీ ఇందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.

ఈ వీడియోలో పిల్లాడి ప‌క్క‌నే తల్లిదండ్రులు, పెంపుడు కుక్క కూర్చుని ఉంటారు.

అయితే చిన్నారితో అమ్మఅని పలికించేందుకు పేరెంట్స్ ప్రయత్నిస్తూ ఉంటారు.

ఏడాది వ‌య‌సు ఉండే ఆ చిన్నారికి గోరు ముద్దలు కూడా తినిపిస్తున్నారు.అయితే పిల్లాడితో అమ్మఅని పిలిపించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను బాగా గ‌మ‌నిస్తున్న కుక్క అమ్మఅని పిలిచి అంద‌రినీ షాక్ కు గురి చేసింది.

అదేంటి కుక్క ఇలా అంటోంది అని వారంతా కొంచెం సేపు అలాగే చూస్తూ ఉండిపోయారు.ఇక ఇదంతా కూడా వీడియో తీసి నెట్టింట షేర్ చేయ‌గా విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

దీనిపై నెటిన్లు చాలా ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

#Dog Mother Bee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube