వైరల్ వీడియో: టీ 15 లక్షలు.. అయిన ఎగబడుతున్న జనం.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

రాజకీయాలలో అనేక చాలా మంది తమ మాటకారి తనన్నా ప్రదర్శిస్తుంటారు.విమర్శలతో ప్రత్యర్థులను ఓ ఆట ఆడేసుకుంటూ ఉంటారు.

 Viral Video A Cup Of Tea Price Is 15 Lakh Rupees More People Interested Why, Mla-TeluguStop.com

తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.రాజకీయాల్లో ఉండాలంటే ప్రజాలోకానికి మంచి మంచి పనులనేవి చేయాలి.

వాటితో పాటుగా తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని తమ మాటలతో కట్టడి చేసే ప్రతిభ ఉండాలి.సరిగ్గా ఆ విధానంలోనే తమ ప్రత్యర్థులను విమర్శిస్తూ వారికి చెమటలు పట్టించేలా చేయాలి.

సాధారణంగా ఇందుకోసం రాజకీయ నాయకులు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు.తమ మాటలతో ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారు.

ఈ రకంగా వారు తమ పబ్లిసిటీని కూడా పెంచుకుంటూ ఉంటారు.ఇటువంటి విధంగానే పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు.

ఆ ఎమ్మెల్యే చాయ్‌ వాలా రూపంలో ఓ ఆట ఆడుకున్నారు.

ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే మదన్ మిత్ర విపరీతమైన ప్రజాధరణను పొందారు.

ఆయనకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే.కోల్‌కతాలోని భువానిపూర్ ప్రదేశంలో ఆదివారం ఓ ప్రోగ్రామ్ ను నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మిత్ర తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి అందరికీ టీ అమ్మారు.టీ అమ్మే వ్యక్తిగా ఆయన మాటలు అందర్నీ నవ్వించాయి.ఆయన టీ ధరను ఓ కప్పు రూ.15 లక్షలకు అమ్మారు.అది ఎంతో ప్రత్యేకమైన టీ అని మోదీ గతంలో అమ్మిన టీ అని చెప్పారు.

మోదీ గతంలో రైల్వే స్టేషన్లలో చాయ్ వాలాగా ఉన్నప్పుడు చేసిన టీ రుచికి తాను చేసిన టీ రుచి సరిపోతుందన్నారు.అటువంటి టీని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.అయితే తాను తయారు చేసిన ఆ టీ ధర ఒక కప్పు 15 లక్షల రూపాయలని తెలిపారు.

మోదీ కూడా ప్రజలకు వాగ్దానం చేసిన దాని ప్రకారంగా మొత్తం కూడా 15 లక్షలే కాబట్టి తాను 15 లక్షలకు ఓ కప్పు టీని అమ్ముతున్నట్లు తెలిపాడు.ఎమ్మెల్యే నిరసనకు అందరూ స్పందించారు.

టీ తాగేందుకు క్యూ కట్టారు.ఎమ్మెల్యే మదన్ మిత్రతో పాటు తమ నిరసనను తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube