వైరల్ వీడియో: ఐదో అంతస్తు నుండి దూకేసిన పిల్లి.. చివరికి..?!

సాధారణంగా మనం ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేసి తగిన చర్యలు తీసుకుంటూ ఉండడం సహజం.అయితే తాజాగా ఒక భవనంలో ఐదవ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది, దీనితో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నం చేశారు.

 Viral Video A Cat Jumps From Five Floor Building Is Survived, Cat Jumping, Build-TeluguStop.com

అంతేకాకుండా ఆ అంతస్తులో ఉన్న వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు అతి కష్టం మీద పూర్తి చేశారు.

అయితే కొద్ది సమయం తర్వాత బిల్డింగ్ కింద ఉన్న వారందరూ కూడా ప్రమాద దృశ్యాలను వీడియో తీస్తున్న సమయంలో వారికి ఒక పిల్లి కనిపించింది.

దీంతో వారు ఆ పిల్లిని రక్షించాలని నిర్ణయించుకోగా, ఆ పిల్లిని కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు.ఆ సమయంలో పిల్లి కూడా అటు ఇటు తిరుగుతూ ప్రమాదం నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేసింది.

కానీ ఆ పిల్లిని కాపాడేందుకు ఎంతటికి వీలుపడకపోవడంతో ఆ పిల్లి చనిపోతుందదేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆ పిల్లి 5వ అంతస్తు నుంచి కిందికి దూకేసింది.

దీంతో అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

కానీ అనంతరం ఆ పిల్లి సాఫీగా లేచి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడం చూసి అందరూ సంతోషానికి లోనయ్యారు.సాధారణంగా పిల్లలు 20 అంతస్తుల భవనం నుంచి కూడా కింద పడిపోయిన కూడా వాటికి ఎటువంటి ప్రమాదం సంభవించదు.ఎందుకంటే పిల్లుల కాళ్ళ కింద స్పాంజిలా ఉంటుందట.ఆ స్పాంజిలా ఉండడంతో పిల్లి కింద పడిన సమయంలో దెబ్బ తగలకుండా రక్షించడానికి సహాయపడుతుందట.ఆ స్పాంజీలా కారణంగానే ఏదైనా పిల్లలు నడుస్తున్న సమయంలో కూడా సౌండ్ మనకు వినపడదు.ఏది ఏమైనా కానీ అగ్నిమాపక సంఘటనలో పిల్లి చాలా సేఫ్ గా బయటపడింది చాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube