వైరల్ వీడియో: హెయిర్‌కట్ చేయిస్తుండగా సెలూన్‌లోకి దూసుకొచ్చిన కారు.. తర్వాత..??

ఒక సెలూన్‌లో కూర్చుని ప్రశాంతంగా హెయిర్‌కట్, షేవ్ చేయించుకుంటుంటే అకస్మాత్తుగా కారు దూసుకొస్తే.ఆ ఊహ ఎతో భయంకరంగా ఉంటుంది.

 Viral Video A Car Rammed Into The Salon While Getting A Haircut Viral Video, Sal-TeluguStop.com

ఈ దృశ్యాలను ఊహించుకుంటుంటేనే ఎంతో భయమేస్తుంది కదా.కాగా తాజాగా ఒక సెలూన్‌లో సరిగ్గా ఇదే జరిగింది.ఒక పెద్ద కారు సెలూన్‌లోకి హై స్పీడ్‌తో దూసుకుపోయింది.దీంతో కస్టమర్లు, సిబ్బంది గాయపడ్డారు.ఈ మొత్తం సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కర్లు కొడుతోంది.

కాగా ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియ రాలేదు.వీడియో మాత్రం జనవరి 29న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

వీడియోలో కారు సెలూన్‌లోకి దూసుకెళుతున్నప్పుడు లోపల ఐదుగురు మగవారు కూర్చొని ఉండటం గమనించవచ్చు.ఇద్దరు హెయిర్‌కట్, షేవింగ్ చేయించుకుంటుండగా ఒకరు బెంచ్‌పై కూర్చొని ఉండటం మీరు గమనించవచ్చు.కారు తమ వైపే దూసుకొస్తున్నట్లు వారు వినగానే బాగా షాక్ అయ్యారు.రెప్పపాటు సమయంలో స్పందించి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించారు.కానీ కారు వచ్చిన వేగానికి వారు రియాక్షన్ టైమ్‌ చాలా ఆలస్యం అయింది.కారు సెలూన్‌లోకి దూసుకెళ్లి, బెంచ్‌పై ఉన్న వ్యక్తిని ఢీకొట్టి గందరగోళం, విధ్వంసం కలిగిస్తుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.పబ్లిక్ ప్రదేశాల్లో బొత్తిగా సేఫ్టీ లేకుండా పోయింది ఎప్పుడు ఎవరు వాహనంతో ఢీకొడుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే 60 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube