వైరల్ వీడియో: తెగ బరువులని ఎత్తేస్తున్న 82 ఏళ్ల బామ్మ..!

ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా చాలామంది జీవితాలలో ఎన్నో మార్పులు సంభవించాయి.బయట పరిస్థితులు చాలా మారడంతో ప్రతి చిన్న విషయంలో కూడా అనేక మార్పులు సంభవించాయి.

 Viral Video A 82 Years Old Lady Lifting Weights, Fitness, 82 Years Old Women. Fi-TeluguStop.com

ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, అలాగే వాతావరణంలోని అనేక మార్పులు సంభవించడం అందుకు సంబంధించి కొత్త వ్యాధులు ఎప్పటికప్పుడు రావడంతో అనేకమంది శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు ఫిట్నెస్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటి కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఫిట్నెస్ పై శ్రద్ధ చూపుతున్నారు.

అయితే ముసలివారు వీటిపై శ్రద్ధ చూపడం చాలా అరుదు.ఇక అసలు విషయంలోకి వెళితే.

తాజాగా 82 సంవత్సరాల బామ్మ ఫిట్నెస్ లక్ష్యాలను పెట్టుకొని ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది.ఇలా ప్రతిరోజు జరుగుతున్న తన దైనందిక జీవితానికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూస్తే సీనియర్ సిటిజన్ లు కూడా బరువులు ఎత్తడంలో ఏమాత్రం తీసిపోరని యువతకు అర్థమవుతుంది.చిరాగ్ అనే జిమ్ ట్రైనర్ ప్రోత్సాహంతోనే ఆయన భామ వర్కవుట్లు చేయడం అలవాటు చేసుకుంది.

తాజాగా ఆ 82 ఏళ్ల బామ్మ ఆ బరువులు ఎత్తడం సంబంధించిన వీడియోను చిరాగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ 82 సంవత్సరాలు ఉన్న భామ ముందు నుంచి చాలా ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉండేది.అయితే గత మూడు నెలల నుంచి కాస్త అనారోగ్యం కారణంగా ఆవిడ కాస్త ఇబ్బందులకు గురి అయ్యింది.

దాంతో ఆవిడకు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడంతో చిరాగ్ బామ్మకు గత కొన్ని రోజుల నుంచి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు.ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పూర్తిగా బాగుండడంతో తన పనులు తానే చేసుకోగలుగుతుంది.

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube