వైరల్ వీడియో: 18 వేల కిలోల బాంబ్ పేలితే ఎలా ఉంటాదంటే..?!

మామూలుగా పండుగ సమయంలో పేల్చే టపాకాయల శబ్దం అందరికీ గుర్తుండే ఉంటుంది.చాలా కొద్ది పరిమాణంలో ఉండే ఆ టపాకాయలు చేసే శబ్దంకు మన చెవి గూబ గుయ్య్‌ మంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 Viral Video 18000 Kilos Bomb Exploded In Ocean By American Navy , 18k Kg,bomb, B-TeluguStop.com

అయితే, అలాంటిది ఓ నిజమైన బాంబ్‌ ను బ్లాస్ట్‌ చేస్తే, దాని నుంచి వచ్చే శబ్దంను ఓ సారి ఊహించగలమా.? నిజంగా కస్టమ్ కదా.! అందులోంచి వచ్చే సౌండ్ కే గుండె ఆగిపోయినంత పనవుతుంది.

ఇకపోతే తాజాగా అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఏకంగా 18000 కిలోల బాంబును పేల్చారు అమెరికా నౌకాదళ అధికారులు.

ఈ బాంబును పేల్చే సమయంలో, సముద్రం లోని నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడి, సముద్రం లోని నీరు మొత్తం ఒక్కసారిగా అలజడికి గురైంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్‌ అవుతుంది.

అమెరికన్‌ నేవి అట్లాంటిక్ మహా సముద్రంలో యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌకపై నుంచి తొలి పేలుడు పరీక్షను నిర్వహించింది.మొత్తం 18,143 కిలోల బరువున్న బాంబును సముద్రం అడుగు భాగాన పేల్చారు.ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్‌ లో భాగంగా ఇలాంటి బాంబు పేలుళ్ల ధాటికి కొత్త నౌకలు ఎలా తట్టుకుంటాయో కనిపెట్టెందుకు, ఈ పరీక్షను నిర్వహించిన్నట్లు తెలిపారు.

ఈ పరీక్షలు పర్యావరణానికి, జలచరాలకు ఎలాంటి నష్టం జరగకుండా చేసినట్టు ప్రకటించారు నౌకాదళం అధికారులు.ఇకపోతే, ఈ బాంబు పేలుడు ధాటికి సముద్రం నీళ్లు పెద్ద ఎత్తుకు ఎగిసిపడ్డాయి.దాంతో సంభవించిన తరంగాలు చాలా దూరం వరకు పడ్డాయి.

ఈ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube