వైరల్ వీడియో: కేవలం 45 సెకన్లలో 15 బిల్డింగులు కుప్ప కూల్చివేత..!

చైనాలో భవంతులు ఎంత పెద్దగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వాటిని చూడాలంటే తల ఎత్తి చూస్తే గాని అవి ఎంత ఎత్తుగా ఉన్నాయో అనే విషయం మనకి అర్ధం కాదు.

 Viral Video 15 Buildings Gets Collapsed In Just 45 Seconds In China, Viral Lates-TeluguStop.com

అయితే అటువంటి భవనాలను నిర్మించడం ఎంత కష్టమో మనకు తెలిసిందే.కష్టంతో పాటు ఎత్తైన భవనాలను నిర్మించాలన్న గాని ఖర్చుతో కూడిన పని అనే చెప్పాలి.

అలాంటి ఒక భవనాన్ని కూల్చివేయాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఎంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి.

చుట్టు పక్కల ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి.అంత పెద్ద భవనాలు కూల్చివేయాలంటే మానవుల వల్ల కాదు.

ఏదైనా మెషీన్ ఉపయోగించడమే లేక పేలుడు పదార్థాలను ఉపయోగించో భవనాలను కూల్చివేస్తారు.అలాంటి ఎత్తైన భవనాలు ఒక్కసారిగా కూలిపోవడం చూస్తే అమ్మో అని అనకుండా మాత్రం ఉండలేరు.

ఒక్క భవనం కూలిపోతేనే మనం అమ్మో అంటే ఏకంగా 15 భవనాలు ఒకేసారి కూలిపోతే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాము.వినడానికే భయంగా ఉంది కదా మరి చూస్తేనే.

షాకింగ్ గా ఉంటుంది కదా.అసలు మనం చూస్తున్నది నిజమేనా లేక గ్రాఫిక్కా అనే అనుమానం కలుగుతుంది.ప్రస్తుతం ఈ 15 భవనాల కూల్చివేతకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఒకసారి చూసిన వాళ్ళు నిజమా లేక కల్పితమా అని తెలుసుకోవడానికి పదే పదే వీడియోను చూస్తూ షేర్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.చైనా లోని యునాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

15 భవనాల కూల్చివేతకు 4.6 టన్నుల పేలుడు పదార్థాలను వినియోగించినట్లు తెలుస్తుంది.కేవలం 45 సెకన్లలో 15 భవంతులు పేక మేడల్లాగా కుప్ప కూలిపోయాయి.అయితే ఈ భవనాలను కూల్చివేసెటప్పుడు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.2 వేలకు పైగా ‘రెస్క్యూ డిపార్ట్‌మెంట్లు, 8 అత్యవసర రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచారు.ఈ 15 భవనాల చుట్టూ ఉన్న అన్ని దుకాణాలను మూసివేసి సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ భవనాలు లియాంగ్ స్టార్ సిటీ ఫేజ్ 2 ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి.ఈ 15 భవనాల విలువ సుమార 1 బిలియన్ చైనీస్ యువాన్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ భవనాలు ఎందుకు కూల్చివేసారో అనే విషయంపై స్పష్టత అనేది లేదు కానీ ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube