వైరల్ వీడియో: ఆ కార్ ఇంజన్ లోకి కొండచిలువ ఎలా వెళ్ళింది అంటారు..?!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా నిమిషాలలో ఇట్లే అందరికీ తెలిసిపోతుంది.అందులో పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.

 Florida Wildlife Officials Captured A 10-foot-long Python In Car Engine, Python,-TeluguStop.com

ఇకపోతే మన నిజ జీవితంలో అనుకోని సంఘటనలు రోజుకు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి.తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన మోర్ బ్లూమెన్‌ఫెల్డ్ అనే వ్యక్తికి ఇలాంటి సంఘటన ఒకటి ఎదురైంది.

తాజాగా ఆయన బయటికి వెళ్దాం అనుకొని అతను తన కార్ స్టార్ట్ చేయబోయాడు.అయితే ఆ కార్ ను స్టార్ట్ చేయలేకపోయాడట.దీంతో అనుమానం వచ్చిన అతను ఇంజన్ చెక్ చేద్దామని కార్ క్యాబిన్ ఓపెన్ చేసాడు.అలా క్యాబిన్ ఓపెన్ చేయగానే అతడు ఆశ్చర్యానికి లోనయ్యాడు.

దానికి కారణం ఆ ఇంజన్ దగ్గర ఏకంగా పది అడుగుల కొండచిలువ ఇంజన్ ను చుట్టుకుని ఉంది.దీంతో ఆయన భయబ్రాంతులకు లోనై వెంటనే వణ్య ప్రాణుల సంరక్షణ విభాగానికి ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు.

ఈ విషయానికి స్పందించిన అధికారులు ఇద్దరు సిబ్బందిని పంపించి ఆ కొండచిలువను చాకచక్యంగా పట్టుకొని ఆ తర్వాత ఆ పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.ఈ సంఘటన ఫ్లోరిడా రాష్ట్రంలోని డానియా బీచ్ వద్ద చోటుచేసుకుంది.

అయితే కొండచిలువ బర్మా ప్రాంతానికి చెందినదిగా అధికారులు తెలిపారు.ఇలా కారు నుండి కొండచిలువను బయటకు తీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ అంత పెద్ద కొండచిలువ కారు లోకి ఎలా వెళ్ళింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube