వైరల్: వామ్మో.. ఎంత పెద్ద వజ్రమో.. ఆఫ్రికా దేశాల్లో లభ్యం..!

ఆఫ్రికాలో ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాన్ని గుర్తించారు.ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ వజ్రంగా నిలిచింది.

 Viral Vammo What A Big Diamond Available In African Countries-TeluguStop.com

ఆఫ్రికా దేశం బోట్స్వానాలో ఈ వజ్రాన్ని గుర్తించారు.ఈ వజ్రం 1,098 క్యారెట్ల విలువ చేస్తుంది.

దేబ్స్వానా డైమండ్ కంపెనీ అనేది వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది.ఆ దేశానికి అధ్యక్షుడు అయిన మొగ్వేట్సీ మెస్సీకి ఈ వజ్రాన్ని కానుకగా అందజేసింది.50 ఏళ్ల హిస్టరీలో ఫస్ట్ టైమ్ తమ సంస్థ ఇలాంటి డైమండ్ లభించడం పట్ల ఆ సంస్థ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది.ఇది అతిపెద్ద మూడవ వజ్రం కావడం వల్ల ఈ వజ్రాన్ని చూడటానికి చాలా మంది ఆసక్తి చూపారు.

 Viral Vammo What A Big Diamond Available In African Countries-వైరల్: వామ్మో.. ఎంత పెద్ద వజ్రమో.. ఆఫ్రికా దేశాల్లో లభ్యం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకు ముందు కూడా ప్రపంచంలోనే అతి పెద్ద రెండు వజ్రాలు కూడా ఆఫ్రికాలోనే లభించడం విశేషం.

ప్రపంచంలో ఇప్పటి వరకూ దొరికిన అతి పెద్ద వజ్రం 3,106 క్యారెట్లు ఉంది.

ఈ వజ్రాన్ని 1905 లో ఆఫ్రికాలో గుర్తించారు.ఈ అతి పెద్ద వజ్రానికి కులియన్ స్టోన్ అని నామకరణం చేశారు.

ఇక రెండవ అతి పెద్ద వజ్రం కూడా ఆఫ్రీకాలోనే గుర్తించారు.ఆ వజ్రం 1109 క్యారెట్ల విలువైనది.

అతి పెద్ద రెండవ వజ్రాన్ని 2015 లో బోట్స్వానాలో గుర్తించారు.ఆ వజ్రానికి లెసిడి-లా-రోనా అనే నామకరణం చేశారు.ఇప్పుడు ఇంకో వజ్రం అతి పెద్ద మూడవదాన్ని గుర్తించారు.దీంతో ఆ దేశ గనుల మంత్రి లెఫోకో మోగి వజ్రాలకు సంబంధించిన విషయాలను తెలియజేశారు.

Telugu 3rd Biggest Dimond, Africa, Found, Social Media, Viral Latest, Viral News, Worlds Third Largest Diamond-Latest News - Telugu

అతి పెద్ద మూడవ వజ్రం అయిన దీనికి అతి త్వరలోనే ఓ పేరును పెడుతామని తెలిపారు.ప్రస్తుతం గుర్తించిన అతి పెద్ద మూడవ వజ్రం 72 మిల్లీ మీటర్ల పొడవు ఉందని తెలిపారు.ఈ వజ్రం 52 మిల్లీ మీటర్ల వెడల్పుతో చాలా ఆకర్షణీయంగా ఉందని తెలిపారు.ఈ దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాలు దొరకడం చాలా సంతోషంగా ఉందని కంపెనీ వారు తెలిపారు.

#WorldsThird #Africa #Found #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు